అంబేడ్కర్ సందేశం మార్గదర్శకం: మాధవ్
ABN , Publish Date - May 17 , 2026 | 05:11 AM
‘చదవండి.. సమీకరించండి.. పోరాడండి’ అన్న అంబేడ్కర్ సందేశం సమాజానికి మార్గదర్శకమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పేర్కొన్నారు.
అమరావతి, మే 16(ఆంధ్రజ్యోతి): ‘చదవండి.. సమీకరించండి.. పోరాడండి’ అన్న అంబేడ్కర్ సందేశం సమాజానికి మార్గదర్శకమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పేర్కొన్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ‘దళితుల ఆత్మగౌరవ గుండెచప్పుడు’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. క్షేత్ర స్థాయిలోని డప్పు కళాకారులకు ప్రాధాన్యం ఇచ్చిన ఈ కార్యక్రమంఆదివారం విజయవాడలో ముగియనుంది. ఈ సందర్భంగా విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం మాధవ్ విలేకరులతో మాట్లాడుతూ.. దళితుల ఆత్మగౌరవ గుండెచప్పుడు కార్యక్రమాన్ని ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు పనతల సురేశ్ ఆధ్వరంలో నిర్వహిస్తున్నామన్నారు. బందరురోడ్డులోని అంబేడ్కర్ విగ్రహం వద్ద డప్పు కళాకారుల ప్రదర్శనలు నిర్వహిస్తామన్నారు.