Share News

అంబటి నోరు జారారు... వాస్తవమే

ABN , Publish Date - Feb 02 , 2026 | 04:37 AM

మాజీ మంత్రి అంబటి రాంబాబు నోరు జారిన మాట వాస్తవమే అని వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోశ్‌ స్పష్టతనిచ్చారు.

అంబటి నోరు జారారు... వాస్తవమే

  • క్షమాపణలు చెప్పి, తప్పు ఒప్పుకొన్నారు: వైసీపీ ఎంపీ పిల్లి

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1(ఆంధ్రజ్యోతి): ‘మాజీ మంత్రి అంబటి రాంబాబు నోరు జారిన మాట వాస్తవమే’ అని వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోశ్‌ స్పష్టతనిచ్చారు. ‘నోరు జారారు కాబట్టే అంబటి క్షమాపణలు చెప్పారు. తప్పు చేశానని విచారం వ్యక్తం చేశారు. టీడీపీ శ్రేణులు ప్రణాళిక ప్రకారమే అంబటిపై దాడి చేశాయి. బడ్డెట్‌లో ఏపీకి తీరని అన్యాయం జరిగింది’ అని అన్నారు. మరో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఏపీలో పరిస్థితులపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు వివరిస్తామన్నారు.

Updated Date - Feb 02 , 2026 | 04:40 AM