Share News

బాబు, లోకేశ్‌లను వదిలేది లేదు

ABN , Publish Date - Mar 27 , 2026 | 05:04 AM

చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించిన పోలీసులు, సీఎం చంద్రబాబు, లోకేశ్‌లపై చర్యలు తీసుకునే వరకు న్యాయస్థానంలో పోరాడతానని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు.

బాబు, లోకేశ్‌లను వదిలేది లేదు

  • వారిపై చర్యలు తీసుకునే వరకు పోరాటం చేస్తా: అంబటి రాంబాబు

మండపేట, కిర్లంపూడి, మార్చి 26(ఆంధ్రజ్యోతి): చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించిన పోలీసులు, సీఎం చంద్రబాబు, లోకేశ్‌లపై చర్యలు తీసుకునే వరకు న్యాయస్థానంలో పోరాడతానని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. గురువారం తూర్పుగోదావరి జిల్లా మండపేటలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులతో, కాకినాడ జిల్లాలోని కిర్లంపూడిలో వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంతో ఆయన భేటి అయ్యారు. ఈ సందర్భంగా రెండుచోట్లా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ నాపై పథకం ప్రకారం దాడి చేసి జైల్లో పెట్టిన కూటమి ప్రభుత్వ తీరును ప్రజలు గమనిస్తున్నారు. జైలులో 18 రోజులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నా. కూటమి ప్రభుత్వం నా కుటుంబాన్ని మానసికంగా వేధించింది. నన్ను అర్ధరాత్రి తీసుకెళ్లి హింసించారు. కాళ్లు పగలగొట్టేంతగా ఇబ్బందులు పెట్టారు. నన్ను జైల్లో పెట్టిన సమయంలో తోట అండగా నిలబడ్డారు. రిజర్వేషన్‌ విషయంలో కూటమి ప్రభుత్వంలో ఉన్న టీడీపీ, జనసేన కాపులను మోసం చేశాయి.’ అని అంబటి పేర్కొన్నారు.

Updated Date - Mar 27 , 2026 | 05:04 AM