Share News

అంబటి విడుదల

ABN , Publish Date - Feb 19 , 2026 | 05:53 AM

ముఖ్యమంత్రిని బూతులు తిట్టిన కేసు సహా పలు నేరారోపణలపై రిమాండ్‌లో ఉన్న వైసీపీ నేత అంబటి రాంబాబు బుధవారం బెయిల్‌పై రాజమండ్రి సెంట్రల్‌ జైలు నుంచి విడుదలయ్యారు.

అంబటి విడుదల

  • సీఎంను బూతులు తిట్టిన కేసు సహాపలు నేరారోపణలపై 18రోజులు జైలులో..

  • వైసీపీ హడావుడి.. బల ప్రదర్శనలా ర్యాలీ

రాజమహేంద్రవరం, గుంటూరు, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రిని బూతులు తిట్టిన కేసు సహా పలు నేరారోపణలపై రిమాండ్‌లో ఉన్న వైసీపీ నేత అంబటి రాంబాబు బుధవారం బెయిల్‌పై రాజమండ్రి సెంట్రల్‌ జైలు నుంచి విడుదలయ్యారు. ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులు జైలు ఆవరణలో హడావుడి చేశారు. దారంతా పూలు చల్లుతూ, భారీ ఊరేగింపు నిర్వహించారు. కార్లకు ఉండే ఫుట్‌ స్టెప్‌పై వేలాడుతూ కేకలు వేస్తూ హల్‌చల్‌ సృష్టించారు. జైలు వద్ద 200 మంది గుమిగూడారు. అంబటి రాంబాబుతో ర్యాలీగా మాజీ వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఇంటికి చేరుకున్నారు. కాగా, రాంబాబు ర్యాలీలో ఓ అంబులెన్స్‌ ఇరుక్కుపోయింది. ట్రాఫిక్‌ స్తంభించడంతో జనంతిప్పలు పడ్డారు.

ఏమయిద్దని అడుగుతున్నా.. : అంబటి

జైలు వద్ద అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. ‘‘సంతోషం. జైలుకు వెళ్లేటప్పుడు సంతోషం. తిరిగి వస్తున్నప్పుడూ సంతోషమే. మళ్లీ వస్తానని చెప్పే వచ్చాను’’’ అని ఆయన తెలిపారు. అసభ్యంగా తిడితే దాడులు చేయరా, అంటూ కొందరు వ్యాఖ్యానించారని, వారికి రేపు (గురువారం) గుంటూరు వెళ్లాక సమాధానమిస్తానన్నారు. ‘‘నా ఇల్లు దహనం చేయడానికి ప్రయత్నం చేశారు. నా ఆఫీస్‌ పగలగొట్టారు. నా పెళ్లాం, బిడ్డల్ని తరిమికొట్టారు. నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు. ఏమయింది?’’ అని వ్యాఖ్యానించారు. డబ్బున్న వాళ్లం కదా...మంచి ఆహారం తినాలని అనుకుంటామని, కానీ కోర్టు అనుమతి ఇవ్వలేదన్నారు కాగా, బుధవారం రాత్రికి ఆయన గుంటూరు చేరుకుంటారని తొలుత భావించారు. అయితే, గురువారం ఉదయం విజయవాడ ప్రకాశం బ్యారేజీ నుంచి గుంటూరు వరకు భారీ ర్యాలీని వైసీపీ నాయకులు ప్లాన్‌ చేశారు. దీంతో ఆయన రాత్రికి రాజమండ్రిలోనే బస చేశారు. కాగా, గుంటూరు నగరంలో అమల్లోని 30 పోలీస్‌ యాక్ట్‌ ను అతిక్రమించి ర్యాలీ నిర్వహిేస్త చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు.

Updated Date - Feb 19 , 2026 | 05:54 AM