Share News

రిమాండ్‌ ఉత్తర్వులు రద్దు చేయండి

ABN , Publish Date - Feb 06 , 2026 | 03:18 AM

సీఎం చంద్రబాబుపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో గుంటూరు కోర్టు ఇచ్చిన రిమాండ్‌ ఉత్తర్వులతో పాటు నల్లపాడు పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ వైసీపీ నేత అంబటి రాంబాబు ...

రిమాండ్‌ ఉత్తర్వులు రద్దు చేయండి

  • హైకోర్టులో వైసీపీ నేత అంబటి పిటిషన్‌

అమరావతి, ఫిబ్రవరి 5(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబుపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో గుంటూరు కోర్టు ఇచ్చిన రిమాండ్‌ ఉత్తర్వులతో పాటు నల్లపాడు పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ వైసీపీ నేత అంబటి రాంబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం హైకోర్టు విచారణ జరిపింది. ఫిర్యాదుదారుడు పిల్లి మాణిక్యరావుకు నోటీసులు జారీ చేసింది. కేసుకి సంబంధించి పూర్తి వివరాలు సమర్పించాలని నల్లపాడు పోలీసులను ఆదేశించింది. విచారణను ఫిబ్రవరి 11కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రాంబాబు తరఫున సీనియర్‌ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, పోలీసుల తరఫున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ మెండ లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు.

Updated Date - Feb 06 , 2026 | 03:18 AM