Share News

అంబటికి 20 వరకు రిమాండ్‌

ABN , Publish Date - Feb 10 , 2026 | 04:45 AM

ముఖ్యమంత్రి చంద్రబాబును అసభ్యకర పదజాలంతో దూషించిన కేసులో ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్‌ జైల్‌లో ఉన్న వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు కోర్టు షరతులతో...

అంబటికి 20 వరకు రిమాండ్‌

  • పోలీసులను బెదిరించిన కేసులో కోర్టు ఆదేశం

  • సీఎంను దూషించిన కేసులో షరతులతో బెయిల్‌

  • మరికొన్ని రోజులు జైల్లోనే..

  • తిరిగి రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలింపు

గుంటూరు, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబును అసభ్యకర పదజాలంతో దూషించిన కేసులో ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్‌ జైల్‌లో ఉన్న వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. ఈ కేసులో రాంబాబును నల్లపాడు పోలీసులు ఇటీవల అరెస్టు చేసి మేజిరేస్టట్‌ ఆదేశాల మేరకు రిమాండ్‌ నిమిత్తం రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలించారు. బెయిల్‌ కోసం గుంటూరులోని స్పెషల్‌ మొబైల్‌ కోర్టులో రాంబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై ఇరువర్గాల వాదనలు విన్న అనంతరం అంబటికి షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేస్తూ మేజిరేస్టట్‌ స్రవంతి సోమవారం తీర్పు చెప్పారు. మరోసారి ఇటువంటి నేరపూరిత చర్యలకు పాల్పడరాదని, కేసును ప్రభావితం చేేస విధంగా బెదిరింపులకు, ప్రలోభాలకు పాల్పడరాదని రాంబాబుకు షరతు విధించారు. కేసులో చార్జిషీటు దాఖలు చేేస వరకు, లేదంటే రెండు నెలల పాటు ప్రతి రెండు శనివారాలకు ఒకసారి పోలీస్‌ ేస్టషన్‌కు హాజరై సంతకాలు చేయాలన్నారు. రూ.పదివేలతో ఇరువురు పూచీకత్తులు సమర్పించాలని పేర్కొన్నారు. అయితే, పోలీసులను బెదిరించిన కేసులో అంబటికి మరో కోర్టు ఈనెల 20 వరకు రిమాండ్‌ విధించడంతో ఆయనను తిరిగి రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలించారు.


పీపీపీ విధానంలో మెడికల్‌ కళాశాలలను ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ గతేడాది నవంబరు 12న అంబటి రాంబాబు ఆధ్వర్యంలో గుంటూరులో వైసీపీ నేతలు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ఆ సందర్భంగా పోలీసుల సూచనలను రాంబాబు బేఖాతరు చేసి, అడ్డంగా పెట్టిన బారికేడ్లను లాగిపడేసారు. అభ్యంతరం చెప్పిన పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లును, సిబ్బందిని బెదిరించి, వారిని నెట్టుకుంటూ బ్రిడ్జి పైకి ర్యాలీగా వెళ్లారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న అంబటి రాంబాబును గుంటూరులోని పట్టాభిపురం పోలీసులు సోమవారం పీటీ వారంట్‌పై రాజమండ్రి సెంట్రల్‌ జైలు నుంచి తీసుకొచ్చి గుంటూరులోని ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ కోర్టులో హాజరు పరచగా మేజిరేస్టట్‌ సారా దానమ్మ ఈ నెల 20 వరకు రిమాండ్‌ విధించారు. దీంతో తిరిగి ఆయనను రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలించారు.


అంబటి మరికొన్ని రోజులు జైల్లోనే..

సీఎంను అసభ్య పదజాలంతో దూషించిన కేసులో అంబటి రాంబాబుకు బెయిల్‌ లభించినప్పటికీ, సీఐను దూషించి, బెదిరించిన కేసులో ఈనెల 20 వరకు రిమాండ్‌ విధించడంతో ఆయన జైలు నుంచి బయటికి వచ్చే అవకాశం లేదు. బయటికి రావాలంటే సీఐని దూషించిన కేసులోనూ అంబటి బెయిల్‌ పొందాల్సి ఉంటుంది. ఈలోగా సీఎంను దూషించిన ఘటనకు సంబంధించి రాష్ట్రంలోని వివిధ పోలీస్‌ స్టేషన్‌లలో నమోదైన కేసులలో పీటీ వారెంట్‌ దాఖలు చేస్తే ఆయనను తిరిగి సంబంధిత కోర్టుల్లో పోలీసులు హాజరుపరచాల్సి ఉంటుంది. తద్వారా ఆయన రిమాండ్‌ కొనసాగే అవకాశం ఉంది. అంటే అంబటి మరికొన్ని రోజులు రాజమండ్రి జైల్లోనే ఉండాల్సి ఉంటుంది.

Updated Date - Feb 10 , 2026 | 04:45 AM