Share News

కస్టడీలో హింసించారంటూ అంబటి పిటిషన్‌

ABN , Publish Date - Apr 07 , 2026 | 06:10 AM

తనను కస్టోడియల్‌ టార్చర్‌కు గురిచేశారంటూ వైసీపీ నేత అంబటి రాంబాబు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ విషయంలో గుంటూరు జిల్లా, నల్లపాడు పోలీసులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడంతో...

కస్టడీలో హింసించారంటూ అంబటి పిటిషన్‌

అమరావతి, ఏప్రిల్‌ 6(ఆంధ్రజ్యోతి): తనను కస్టోడియల్‌ టార్చర్‌కు గురిచేశారంటూ వైసీపీ నేత అంబటి రాంబాబు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ విషయంలో గుంటూరు జిల్లా, నల్లపాడు పోలీసులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడంతో పాటు క్రమశిక్షణ చర్యలు చేపట్టేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. తన అక్రమ నిర్బంధం, కస్టోడియల్‌ టార్చర్‌పై సీఐడీ, సిట్‌తో కాకుండా ఏదైనా స్వతంత్ర సంస్థతో దర్యాప్తునకు ఆదేశించాలని.. తన నిర్బంధ కాలానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను భద్రపరిచేలా ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్ధించారు. సీఎం చంద్రబాబును అసభ్యపదజాలంతో దూషించిన వ్యవహారంలో టీడీపీ నేతల ఫిర్యాదు ఆధారంగా అంబటి రాంబాబుపై గుంటూరు, నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. రాంబాబును అరెస్ట్‌ చేసి మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపర్చగా రిమాండ్‌ విధించారు. పోలీసుల నిర్బంధంలో ఉండగా తనను కస్టోడియల్‌ టార్చర్‌కు గురిచేశారని, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకొనేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ అంబటి తాజాగా హైకోర్టును ఆశ్రయించారు.

Updated Date - Apr 07 , 2026 | 06:11 AM