నెల్లూరులో అంబటిపై 2 కేసులు
ABN , Publish Date - Feb 04 , 2026 | 05:58 AM
ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ నేత అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలపై నెల్లూరు జిల్లాలో రెండు కేసులు నమోదయ్యాయి.
మాజీ మంత్రి కాకాణిపై కూడా..
నెల్లూరు (క్రైం), ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ నేత అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలపై నెల్లూరు జిల్లాలో రెండు కేసులు నమోదయ్యాయి. మనుబోలు పోలీస్ స్టేషన్‌లో టీడీపీ మండల అధ్యక్షుడు పొన్నూరు రామకృష్ణయ్య, దుత్తలూరు పోలీస్ స్టేషన్‌లో నెల్లూరు పార్లమెంట్ అధికార ప్రతినిధి చీదర్ల మల్లిఖార్జున చేసిన ఫిర్యాదుల మేరకు ఈ కేసులు నమోదయ్యాయి. వీటిపై త్వరలోనే పీటీ వారెంట్ వేయనున్నారు. అలాగే మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై కూడా నెల్లూరు జిల్లా పొదలకూరు స్టేషన్‌లో టీడీపీ మండల అధ్యక్షుడు తలచీరు మస్తాన్‌బాబు, దర్గామిట్ట పోలీసు స్టేషన్‌లోనూ టీడీపీ నాయకుడు పచ్చిపాల రామిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాకాణిపై కేసులు నమోదయ్యాయి.