రాంబాబు అనే కుక్కకీ ఒక రోజొస్తుంది
ABN , Publish Date - Feb 21 , 2026 | 04:20 AM
ప్రతి కుక్కకీ ఓ రోజు వస్తుంది... ఈ రాంబాబు అనే కుక్కకి కూడా ఒక రోజు వస్తుంది’ అని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు.
చంద్రబాబు, లోకేశ్ నా ఇంటిపై దాడి చేయించారు: అంబటి
అమరావతి, గుంటూరు, ఫిబ్రవరి 20(ఆంధ్రజ్యోతి): ప్రతి కుక్కకీ ఓ రోజు వస్తుంది... ఈ రాంబాబు అనే కుక్కకి కూడా ఒక రోజు వస్తుంది’ అని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. శుక్రవారం గుంటూరులోని తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ చావనైనా చస్తాను కానీ తగ్గేది లేదని స్పష్టం చేశారు. ‘సీఎం చంద్రబాబు, లోకేశ్ నా ఇంటిపై దాడి చేయించి, మానిటర్ చేశారు. బెదిరించి, భయపెట్టాలని చూస్తే భయపడేదిలేదు. పోలీసుల సాయంతో టీడీపీ నాయకులు నా ఇంటిపై దాడులు చేశారు. ఇలాంటిది ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా చూశామా? చంపితే చస్తా... బతికుంటే సాధిస్తా. అన్నింటికీ మూల్యం చెల్లించుకునే రోజులొస్తాయి. నాకూ ఒక రోజు వస్తుంది’ అని అంబటి హెచ్చరించారు. కాగా, తాడేపల్లి నివాసంలో శుక్రవారం అంబటి జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా జగన్... ‘కూటమి ప్రభుత్వంపై పోరులో ఏమాత్రం తగ్గొద్దు. కేసులకు భయపడొద్దు. వైసీపీ అధికారంలోకి వచ్చాక చంద్రబాబు, పవన్‌కల్యాణ్, లోకేశ్ సహా అధికారపక్షానికి వత్తాసు పలుకుతున్న పోలీసు అధికారులపైనా చర్యలు తీసుకుంటాం’ అన్నారు.