Share News

అనంతలో అంబటి దిష్టి బొమ్మ దహనం

ABN , Publish Date - Feb 02 , 2026 | 05:20 AM

ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత అంబటి రాంబాబు దిష్టి బొమ్మకు టీడీపీ నాయకులు అనంతపురంలో ఆదివారం అంతిమయాత్ర నిర్వహించారు.

అనంతలో అంబటి దిష్టి బొమ్మ దహనం

అనంతపురం క్రైం, ఫిబ్రవరి 1(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత అంబటి రాంబాబు దిష్టి బొమ్మకు టీడీపీ నాయకులు అనంతపురంలో ఆదివారం అంతిమయాత్ర నిర్వహించారు. క్లాక్‌ టవర్‌ నుంచీ సప్తగిరి సర్కిల్‌ వరకూ అంబటి దిష్టిబొమ్మను మోస్తూ శవయాత్ర చేశారు. తర్వాత సప్తగిరి సర్కిల్‌లో ఆయన దిష్టిబొమ్మను పెట్రోల్‌ పోసి, నిప్పు పెట్టి దహనం చేశారు. దివ్యాంగులు, వికలాంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌ గుడిపూటి నారాయణస్వామి ఆధ్వర్యంలో దివ్యాంగులు.. అంబటి దిష్టిబొమ్మను ఈడ్చుకుంటూ ర్యాలీగా వెళ్లి క్లాక్‌టవర్‌ వద్ద దహనం చేశారు.

Updated Date - Feb 02 , 2026 | 05:21 AM