Share News

మావిగాన్‌ కావాలా?అమరావతా?

ABN , Publish Date - Apr 05 , 2026 | 05:20 AM

నిర్మాణం జరుగుతున్న రాజధాని అమరావతి, మాజీ సీఎం జగన్‌ చెప్పిన మావిగన్‌లో ఏది మంచిదో ప్రజలు నిర్ణయించుకోవాలని వైసీపీ రాజకీయ సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి...

మావిగాన్‌ కావాలా?అమరావతా?

  • ఏది మంచిదో ప్రజలు నిర్ణయించుకోవాలి

  • కర్నూలులో రాజధానిని కట్టనని చెప్పలేదు: సజ్జల

అమరావతి, ఏప్రిల్‌ 4(ఆంధ్రజ్యోతి): నిర్మాణం జరుగుతున్న రాజధాని అమరావతి, మాజీ సీఎం జగన్‌ చెప్పిన మావిగన్‌లో ఏది మంచిదో ప్రజలు నిర్ణయించుకోవాలని వైసీపీ రాజకీయ సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. సీఎం చంద్రబాబు చేస్తున్నదానికి, జగన్‌ చెబుతున్నదానికి ప్రజలు బేరీజు వేసుకోవాలన్నారు. శనివారం తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో అనుకూల మీడియాతో ఆయన మాట్లాడారు. అమరావతికి ప్లాన్‌-బీగా మావిగన్‌ అంటే జగన్‌కు తాటాకులు కడుతున్నారెందుకన్నారు. జగన్‌కు తాటాకు లు కడుతూ అమరావతిలో పనులు చక్కదిద్దుకోవాలని చంద్రబాబు చూస్తున్నారని ఆరోపించారు. జగన్‌ కర్నూలులో న్యాయ రాజధానిని నిర్మించనని చెప్పారా అని అన్నారు. మావిగన్‌కు వైసీపీ నేతలు ఎవరూ వ్యతిరేకంగా లేరని అన్నారు.

Updated Date - Apr 05 , 2026 | 05:21 AM