అమరావతి టు హైదరాబాద్ 70 నిమిషాల్లోనే..
ABN , Publish Date - Apr 29 , 2026 | 04:15 AM
రైల్వే కనెక్టివిటీలో రాజధాని అమరావతిని వేగంగా ట్రాక్ ఎక్కిస్తూ కేంద్ర ప్రభుత్వం అతి కీలక నిర్ణయాలను ప్రకటించింది. విశాఖలో మంగళవారం గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన వేదికగా దీనిపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు.
రాజధాని నుంచి చెన్నైకు 120 నిమిషాలు
వేగంగా ట్రాక్‌పైకి వచ్చేస్తున్న అమరావతి
రెండు బులెట్ ట్రైన్లు ఏపీకి వస్తున్నాయి
ఏపీని కనెక్ట్ చేస్తూ లక్ష కోట్ల ప్రాజెక్టులు
జూన్ 1న సౌత్ కోస్ట్ రైల్వే జోన్ నోటిఫై
విశాఖ నుంచి మూడు సబ్ సీ కేబుల్స్
గూగుల్ సెంటర్ శంకుస్థాపనలో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడి
విశాఖపట్నం, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి) : రైల్వే కనెక్టివిటీలో రాజధాని అమరావతిని వేగంగా ట్రాక్ ఎక్కిస్తూ కేంద్ర ప్రభుత్వం అతి కీలక నిర్ణయాలను ప్రకటించింది. విశాఖలో మంగళవారం గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన వేదికగా దీనిపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. అమరావతి నుంచి హైదరాబాద్‌కు 70 నిమిషాల్లో చేర్చే బులెట్ ట్రైన్ ప్రాజెక్టు త్వరలోనే సాకారం కానున్నట్టు తెలిపారు. అమరావతి నుంచి చెన్నైకు 112 నిముషాల్లో చేరుకునేలా మరో బులెట్ ట్రైన్ నిర్మాణం చేయనున్నామని చెప్పారు. ‘‘డబుల్ ఇంజన్ బులెట్ ట్రైన్ సర్కారు ద్వారా ఏపీకి రూ. 10,134 కోట్ల రైల్వే బడ్జెట్ కేటాయించాం. గతంలో ఉమ్మడి ఏపీకి కేవలం రూ. 886 కోట్లు మాత్రమే బడ్జెట్ ఉండేది. ప్రస్తుతం రూ.1.06 లక్షల కోట్ల రైల్వే ప్రాజెక్టులు ఏపీని కనెక్ట్ చేస్తూ నిర్మాణంలో ఉన్నాయి. దేశంలోనే తొలిసారి నవ నిర్మాణ్ ప్రాజెక్టు ద్వారా ఏపీలో 74 ేస్టషన్లను ఆధునీకరిస్తున్నాం. 832 ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌ల నిర్మాణం జరిగింది. 1039 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ నిర్మాణం జరుగుతోంది. 100 శాతం ఎలక్ర్టిఫికేషన్ పూర్తి చేసుకున్న రాష్ట్రం ఏపీ. 16 వందే భారత్ సర్వీసులు ఏపీలో నడుస్తున్నాయి. 22 అమృత్ భారత్ సర్వీసులు కూడా ఏపీ నుంచి నడుస్తున్నాయి. రైళ్ల డిజైన్, ఉత్పత్తిలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. ఏపీలో సౌత్ కోస్ట్ రైల్వే జోన్ లాంటి కీలకమైన విభజన హామీని కేంద్రం నెరవేర్చింది. జూన్ 1న సౌత్ కోస్ట్ రైల్వే జోన్‌ను అధికారికంగా నోటిఫై చేయబోతున్నాం.’’ అని వెల్లడించారు. అభివృద్థిలో, సంక్షేమంలో దక్షిణాది రాష్ర్టాలకు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి న్యాయం చేస్తుందని తెలిపారు.
విజనరీ లీడర్ చంద్రబాబు
విజనరీ లీడర్ చంద్రబాబు నిర్మించిన హైదరాబాద్ లో నిర్మించిన సైబర్ టవర్ ఐటీకి ఐకానిక్ అయినట్టే, గూగుల్ ఏఐ డేటా సెంటర్ తో విశాఖపట్నం ఇక ఏఐ పట్నంగా మారనున్నదని అశ్వినీ వైష్ణవ్ వ్యాఖ్యానించారు. ‘‘విద్య, వైద్యం, ఏరోస్పేస్, లాజిస్టిక్స్, వ్యవసాయం... ఇలా వేర్వేరు రంగాల్లో ఏఐ విప్లవం వస్తోంది. గూగుల్ క్లౌడ్ ఇండియా ఏఐ హబ్ ద్వారా విశేషమైన ేసవలు అందుతాయి. ఎంఓయూ చేసుకున్న అతి తక్కువ సమయంలోనే డేటా సెంటరు శంకుస్థాపన దశకు చేరింది. ఈ సెంటర్ ను ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించుకునే రోజు దగ్గర్లోనే ఉంది. ఐటీ ేసవల రంగంలో భారత్ లీడర్‌గా ఎదగడంలో దేశ నాయకత్వం కీలకంగా వ్యవహరించింది. గతంలో ఉత్పత్తి రంగంపై భారత్ ముందుకు వెళ్లలేకపోయింది. సెమీ కండక్టర్లు, చిప్, ల్యాప్ టాప్, మొబైల్ ఉత్పత్తుల లాంటి ఎలక్ర్టానిక్స్ ఉత్పత్తిలో వెనుకబడ్డాం. మోదీ చొరవతో మొబైల్ మాన్యుఫాక్చరింగ్ రంగంలో ఇప్పుడు ముందడుగు వేశాం. భారత్ నుంచి ఇప్పుడు మొబైల్ ఫోన్లు అత్యధికంగా ఎగుమతి అవుతున్నాయి. దేశీయంగా అవసరమైన 50 శాతం ఎలక్ర్టానిక్ పరికరాలను మన దేశంలోనే ఉత్పత్తి చేసుకుంటున్నాం. మేజర్ ఎలక్ర్టానిక్స్ డెవల్‌పమెంట్, డిజైన్ చేసే దేశంగా భారతదేశాన్ని గుర్తించాలి. సెమీ కండక్టర్ మిషన్‌లో భాగంగా ఇప్పటికే వాణిజ్య పరమైన ఉత్పత్తిని ప్రారంభించాం. సెమీ కండక్టర్లు, ఎలక్ర్టానిక్స్ పరికరాల ఉత్పత్తిలో భారత్ ఎంతో ఎదిగింది.’’ అని తెలిపారు. డేటా సెంటర్లకు అవసరమైన సర్వర్లను కూడా దేశంలోనే ఉత్పత్తి చేసేలా టెక్ కంపెనీలు కృషి చేయాలి. గూగుల్ కూడా తమ సర్వర్లను, జీపీయూ, చిప్ లను ఇక్కడే ఉత్పత్తి చేేసలా చూడాలి. ఈ సూచనను గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కు తెలియజేయండి’’ అని కోరారు. తక్కువ వ్యయంతోనే నాణ్యమైన ఉత్పత్తులు తయారు చేేసందుకు వీలుందన్నారు. విశాఖ నుంచి మూడు సబ్ సీ కేబుల్స్ ను వేస్తున్నందుకు గూగుల్ కు ధన్యవాదాలని, ఆస్ర్టేలియా, పశ్చిమాసియా మీదుగా యూర్‌పకు, అఫ్రికా మీదుగా అమెరికాకు వెళ్లేలా ఈ కేబుల్స్ వేస్తున్నారని తెలిపారు. కోల్‌కతా నుంచి చెన్నై వరకూ ఉన్న తూర్పు కోస్తా రైల్వే డబుల్ లైన్లను ఫోర్ లైన్లుగా మారుస్తామని, కంటైనర్, ఫ్రైట్ ట్రైన్లతో పాటు 500 రైళ్లతో ఈ ప్రాంతాన్ని అనుసంధానిస్తామని చెప్పారు. అయితే, ప్రతిపక్ష పార్టీలు ప్రతి అంశాన్నీ రాజకీయం చేస్తున్నాయని అశ్వినీ వైష్ణవ్ మండిపడ్డారు.