Share News

రాష్ట్రానికి అమరావతి గ్రోత్‌ ఇంజన్‌

ABN , Publish Date - Apr 09 , 2026 | 04:26 AM

రాజధాని అమరావతి రాష్ట్రానికి గ్రోత్‌ ఇంజన్‌లా పనిచేస్తుందని ప్రపంచ బ్యాంకు బృందం అభిప్రాయపడింది.

రాష్ట్రానికి అమరావతి గ్రోత్‌ ఇంజన్‌

  • ప్రపంచ బ్యాంకు బృందం ఉద్ఘాటన.. సీఎంతో భేటీ

అమరావతి, ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతి రాష్ట్రానికి గ్రోత్‌ ఇంజన్‌లా పనిచేస్తుందని ప్రపంచ బ్యాంకు బృందం అభిప్రాయపడింది. బుధవారం ఆ బ్యాంకు ప్రతినిధుల బృందంతో సీఎం చంద్రబాబు సచివాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అమరావతి నిర్మాణ ప్రగతిని ప్రతినిధి బృందం ప్రశంసించింది. రాజధానిలో మౌలిక సదుపాయాలు, ఐటీ, విద్యుత్తురంగ సంస్కరణల కారణంగా ఈ నగరం భారీగా అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షిస్తుందని అభిప్రాయపడింది. వాణిజ్య కార్యకలాపాలకు అమరావతి కేంద్రంగా మారుతుందని ఆశిస్తున్నట్లు బ్యాంకు ప్రతినిధులు పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో రాజధాని నిర్మాణం చేపట్టడంతో పాటు, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి దిశగా పనిచేస్తున్నట్లు చంద్రబాబు వారికి వివరించారు.

Updated Date - Apr 09 , 2026 | 04:27 AM