రాజధానిని AMARAVATIగా రాయండి: సీఎస్
ABN , Publish Date - Apr 16 , 2026 | 05:16 AM
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పేరును ప్రభుత్వ రికార్డుల్లో AMARAVATI అని రాయాలంటూ ప్రభుత్వం మెమో జారీ చేసింది.
అమరావతి, ఏప్రిల్ 15(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పేరును ప్రభుత్వ రికార్డుల్లో AMARAVATI అని రాయాలంటూ ప్రభుత్వం మెమో జారీ చేసింది. రాజధాని పేరును ఇంగ్లీషులో రాసేటప్పుడు AMARAVATHI అని కాకుండా AMARAVATI గానే రాయాలని సూచిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ మెమో జారీచేశారు.
సచివాలయ శాఖలు, హెచ్‌ఓడీలు, జిల్లా కలెక్టర్లు, ఇతర శాఖలకు ఇప్పటికే అమరావతిని ఇంగ్లీషులో రాసేటప్పుడు AMARAVATIగా రాయాలని మున్సిపల్‌శాఖ జీఓ 97 జారీ చేసిందన్నారు. అయితే కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు AMARAVATI బదులు AMARAVATHIగా రాయడంతో యూనిఫార్మిటీ పోతోందని మెమోలో పేర్కొన్నారు.