సచివాలయం డిస్పెన్సరీలో మాక్ డ్రిల్
ABN , Publish Date - May 01 , 2026 | 03:41 AM
నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ సూచన మేరకు గురువారం అమరావతి సచివాలయంలోని డిస్పెన్సరీలో డాక్టర్లు, సిబ్బంది ...
అమరావతి, ఏప్రిల్ 30(ఆంధ్రజ్యోతి): నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ సూచన మేరకు గురువారం అమరావతి సచివాలయంలోని డిస్పెన్సరీలో డాక్టర్లు, సిబ్బంది మాక్ డ్రిల్ నిర్వహించారు. ఏవైనా ఆయిల్స్, కెమికల్స్, యాసిడ్స్ శరీరంపై పడినప్పుడు కాలిన గాయాలతో వచ్చిన వారికి అత్యవసరంగా ఎలాంటి చికిత్స అందించాలన్న దానిపై మాక్ డ్రిల్ లో చూపించారు. కాలిన గాయాలతో అంబులెన్సులో వచ్చిన వారికి వెనువెంటనే ఎలాంటి చికిత్స అందిస్తారన్న దానిపై ఇక్కడ చూపించామని డాక్టర్ హదస్సా తెలిపారు. ప్రమాద పరిస్థితి నుంచి పేషెంట్ ప్రాథమికంగా కోలుకున్న తర్వాత జిల్లా ఆసుపత్రులకు పంపించే క్రమంలో ప్రతి దశలోనూ ఎలాంటి చికిత్స అందించాలన్న దానిపై డాక్టర్లు, సిబ్బందికి అవగాహన కల్పించామని ఆమె చెప్పారు. సెకండరీ హెల్త్ డైరెక్టర్ ఆదేశాల మేరకు జరిగిన ఈ మాక్‌డ్రిల్‌లో డాక్టర్ జి.దివ్య సాయిశ్రీ, డాక్టర్ చింతి ఆనంద్, డాక్టర్ వి.ప్రశాంత్ కుమార్ పాల్గొన్నారు.