Share News

దేశ క్వాంటం టెక్నాలజీకి పునాది

ABN , Publish Date - Feb 08 , 2026 | 04:59 AM

దేశ క్వాం టం టెక్నాలజీకి పునాదిగా అమరావతి క్వాంటం వ్యా లీ నిలుస్తుందని ఐటీ, ఎలకా్ట్రనిక్స్‌, విద్యా శాఖ మం త్రి నారా లోకేశ్‌ ఉద్ఘాటించారు.

దేశ క్వాంటం టెక్నాలజీకి పునాది

  • అమరావతి క్వాంటం కంప్యూటింగ్‌ హబ్‌పై లోకేశ్‌

  • ఫ్రంటియర్‌ ఇన్నోవేషన్‌ సృష్టికర్తగా రాష్ట్రాన్ని నిలబెడతాం

  • క్వాంటం వ్యాలీతో భారీ స్థాయిలో హైటెక్నాలజీ ఉద్యోగాలు

  • చంద్రబాబు సారథ్యంలో క్వాంటం విప్లవం: మంత్రి

అమరావతి, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): దేశ క్వాం టం టెక్నాలజీకి పునాదిగా అమరావతి క్వాంటం వ్యా లీ నిలుస్తుందని ఐటీ, ఎలకా్ట్రనిక్స్‌, విద్యా శాఖ మం త్రి నారా లోకేశ్‌ ఉద్ఘాటించారు. శనివారం అమరావతి క్వాంటంవ్యాలీ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌ మాట్లాడుతూ.. దేశ క్వాంటం టెక్నాలజీ భవిష్యత్‌ నాయకత్వానికి పునాది వేస్తున్నామన్నారు. అమరావతిలో చరిత్రాత్మక క్వాంటం వ్యాలీ కి సీఎం చంద్రబాబు భూమి పూజ చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా క్వాంటం వ్యాలీ నిర్మాణంలో భాగస్వామ్యమయ్యే 14 సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడాన్ని స్వాగతించారు. సాఫ్ట్‌వేర్‌ రంగాన్ని ప్రపంచం అర్థం చేసుకుంటున్న సమయంలోనే ఈ రంగంలో ఆంధ్రప్రదేశ్‌ నైపుణ్యా న్ని సాధించిందన్నారు. ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీలో హైదరాబాద్‌ను గ్లోబల్‌ లీడర్‌గా నిలపాలన్న సంకల్పంతో చంద్రబాబు.. మైక్రోసాఫ్ట్‌ అప్పటి సీఈవో బిల్‌ గేట్స్‌తో సమావేశమై ఒప్పించారన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో క్వాంటం కంప్యూటింగ్‌ హబ్‌ను ఏర్పాటు చేసేందుకు ఐబీఎం, టీసీఎల్‌, ఎల్‌ అండ్‌ టీలను ఒప్పించారన్నారు. హైదరాబాద్‌కు ఐటీ రంగాన్ని తీసుకువచ్చి లక్షలాది మంది యువతకు ఉద్యోగాల ను కల్పించేలా చంద్రబాబు కృషి చేశారన్నారు. రాష్ట్రానికి 3 బలాలు ఉన్నాయని.. వాటిలో మొదటిది చంద్రబాబు సమర్థ నాయకత్వమని లోకేశ్‌ పేర్కొన్నారు. రెండోది స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ అని వెల్లడించారు. దీనిలో భాగంగానే విశాఖలో భారీ పెట్టుబడితో గూగుల్‌ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేస్తోందన్నారు. ఈ లక్ష్యాన్ని కేవలం 13 నెలల్లోనే సాధించామన్నారు. దేశంలో ఇతర రాష్ట్రాల్లో అసాధ్యమనుకున్నది సాధించగలిగే సమర్థ నాయకత్వం ఉందన్నారు. రాష్ట్రంలో డబుల్‌ ఇంజన్‌ బుల్లెట్‌ ట్రయిన్‌ సర్కారు ఉందని తెలిపారు.


రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించాలన్న ఆకలి, కాంక్ష ఉన్నాయన్నారు. స్టార్టప్‌ రాష్ట్రంగా పెట్టుబడులను ఆకర్షిస్తున్నామన్నారు. ప్రపంచంలోనే మొట్టమొదటిగా అమరావతి క్వాంటం కంప్యూటింగ్‌ వాలీకి శ్రీకారం చుట్టామని లోకేశ్‌ వెల్లడించారు. సాఫ్ట్‌వేర్‌, ఆల్గార్థిమ్‌ ఎకో సిస్టమ్‌ను ఏర్పాటు చేస్తున్నామని లోకేశ్‌ వెల్లడించా రు. భవిష్యత్తును తీర్చిదిద్దే అత్యున్నత సాంకేతిక ఆవిష్కరణ సృష్టికర్తగా రాష్ట్రాన్ని మారుస్తున్నామని లోకేశ్‌ చెప్పారు. క్వాంటం కంప్యూటింగ్‌ పరికరాల హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌ను ప్రపంచానికి సరఫరా చేసేలా కార్యాచరణకు సిద్ధమయ్యామని వివరించారు. క్వాం టం కంప్యూటింగ్‌లో 50 వేల మందికి శిక్షణ ఇచ్చామన్నారు. మరో పది లక్షల మంది యువతకు కూడా శిక్షణను ఇస్తామన్నారు. క్వాంటం కంప్యూటింగ్‌ హబ్‌లో విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి సహకరించడం తో పాటు భవిష్యత్తు క్వాంటం ఇంజనీర్లను తయారు చేస్తామని ప్రకటించారు. అమరావతి అడ్మినిస్ట్రేటివ్‌ క్వాపిటల్‌ మాత్రమే కాదని, సైన్స్‌, కంప్యూటేషన్‌, ఇన్నోవేషన్‌ క్యాపిటల్‌గా ఉంటుందన్నారు. గ్లోబల్‌ టాలెంట్‌కు కేరా్‌ఫగా క్వాంటం వ్యాలీ వ్యవహరిస్తుందని వివరించారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో దేశంలో క్వాంటం కంప్యూటింగ్‌ విప్లవాన్ని రాష్ట్రం.. ముందుండి నడిపిస్తుందని లోకేశ్‌ వెల్లడించారు.

Updated Date - Feb 08 , 2026 | 05:01 AM