Share News

ప్రగతికి ప్రేరణ క్వాంటమ్‌ వ్యాలీ

ABN , Publish Date - Apr 01 , 2026 | 06:04 AM

దేశ భవిష్యత్తు, ప్రగతికి అమరావతి క్వాంటమ్‌ వ్యాలీ ప్రేరణగా నిలుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. భవిష్యత్తు అంతా ఇక క్వాంటమ్‌ కంప్యూటర్లదేనని అన్నారు.

ప్రగతికి ప్రేరణ క్వాంటమ్‌ వ్యాలీ

  • భవిష్యత్‌ అంతా ఆ కొత్త టెక్నాలజీదే: చంద్రబాబు

అమరావతి, మార్చి 31(ఆంధ్రజ్యోతి): దేశ భవిష్యత్తు, ప్రగతికి అమరావతి క్వాంటమ్‌ వ్యాలీ ప్రేరణగా నిలుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. భవిష్యత్తు అంతా ఇక క్వాంటమ్‌ కంప్యూటర్లదేనని అన్నారు. రాజధాని అమరావతిలోఎనిమిది టవర్లను నిర్మించి క్వాంటమ్‌ టెక్నాలజీకి ప్రోత్సాహాన్ని అందిస్తామని తెలిపారు. దేశీయంగా క్వాంటమ్‌ కంప్యూటర్‌ను రెండేళ్లలో తయారు చేసుకోవాలని భావిస్తున్నామని, దీనికి అవసరమైన క్వాంటమ్‌ పరికరాలు, టెక్నాలజీ, క్రయోజెనిక్స్‌, ఆల్గారిథమ్స్‌ ఇలా అన్ని రకాలైన క్వాంటమ్‌ పరికరాలు రాష్ట్రంలోనే తయారవుతాయని సీఎం ధీమా వ్యక్తం చేశారు. వెలగపూడి సచివాలయంలో మంగళవారం అమరావతి క్వాంటమ్‌ వ్యాలీ-క్వాంటమ్‌ హార్డ్‌వేర్‌ ఉత్పత్తి ఎకోసిస్టమ్‌పై రౌండ్‌టేబుల్‌ సమావేశం జరిగింది. ఇందులో చంద్రబాబుతో పాటు నేషనల్‌ క్వాంటమ్‌ మిషన్‌ డైరెక్టర్‌ జేబీవీ రెడ్డి, స్టేట్‌ క్వాంటమ్‌ మిషన్‌ డైరెక్టర్‌ సీవీ శ్రీధర్‌, ఐబీఎం డైరెక్టర్‌ అమిత్‌ సింఘీ, సీడాక్‌, సీడాట్‌, డీఆర్‌డీఓ, బార్క్‌ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. క్వాంటమ్‌ కంప్యూటర్‌ పరికరాల తయారీ కంపెనీలు, క్రయోజెనిక్స్‌, ఫోటోనిక్స్‌, పవర్‌ ఎలకా్ట్రనిక్స్‌ కంపెనీల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ‘‘గ్రీన్‌, క్లీన్‌ ఎనర్జీ దిశగా ఆంధ్రప్రదేశ్‌ ముందుకు వెళుతోంది. ఇది గేమ్‌ ఛేంజర్‌గా మారుతుంది. సంజీవని ప్రాజెక్టుతో వ్యక్తిగత డిజిటల్‌ హెల్త్‌ రికార్డులను సిద్ధం చేస్తున్నాం. నాలెడ్జ్‌ ఎకానమీ, సేవల రంగం పెరగడం ద్వారా దేశానికి ప్రయోజనం కలుగుతుంది. అమరావతి లివబుల్‌ సిటీగా మారుతుంది. ఇక అమరావతి అన్‌ స్టాపబుల్‌. అమెరికాలోని సిలికాన్‌ వ్యాలీతో పోలిస్తే క్వాంటమ్‌ వ్యాలీకి చాలా వేగం ఎక్కువ. అమరావతి క్వాంటమ్‌ వ్యాలీ దేశ భవిష్యత్తు, ప్రగతికి ప్రేరకం’’ అని సీఎం చెప్పారు.

Updated Date - Apr 01 , 2026 | 06:05 AM