క్వాంటమ్‌లో అమరావతి గ్లోబల్ లీడర్: సీఎం
ABN , Publish Date - Apr 12 , 2026 | 05:38 AM
క్వాంటమ్ కంప్యూటర్‌లో అమరావతి గ్లోబల్ లీడర్ అని సీఎం చంద్రబాబు అభివర్ణించారు. ఈ నెల 14న వరల్డ్ క్వాంటమ్ కంప్యూటర్ డే సందర్భంగా అమరావతి క్వాంటం వ్యాలీలో రెండు క్వాంటమ్ కంప్యూటర్లు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.
ఏపీలో సరికొత్త చరిత్రకు శ్రీకారం: మంత్రి లోకేశ్
అమరావతి, ఏప్రిల్ 11(ఆంధ్రజ్యోతి): క్వాంటమ్ కంప్యూటర్‌లో అమరావతి గ్లోబల్ లీడర్ అని సీఎం చంద్రబాబు అభివర్ణించారు. ఈ నెల 14న వరల్డ్ క్వాంటమ్ కంప్యూటర్ డే సందర్భంగా అమరావతి క్వాంటం వ్యాలీలో రెండు క్వాంటమ్ కంప్యూటర్లు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. అవి పరిశోధనలకు మాత్రమే కాదని.. ప్రపంచ స్థాయి నాయకత్వానికి పునాదిగా పేర్కొన్నారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీ ప్రతిభ, సాంకేతికత, దృఢసంకల్పం కలిసే స్థలమని సీఎం స్పష్టం చేశారు. కాగా, రాష్ట్రంలో సరికొత్త చరిత్రకు శ్రీకారం చుడుతున్నామని మంత్రి లోకేశ్ ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో దేశంలో మొట్టమొదటిసారిగా అమరావతి క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అమరావతిలోని ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలోనూ, గన్నవరం మేథా టవర్స్‌లోనూ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన క్వాంటమ్ కంప్యూటర్లను, హార్డ్‌వేర్ టెస్ట్ బెడ్‌లను ప్రారంభిస్తున్నామని లోకేశ్ వెల్లడించారు.
యనమలకు సీఎం పరామర్శ
టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడిని సీఎం చంద్రబాబు పరామర్శించారు. ఇటీవల హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో యనమలకు వైద్యులు స్టంట్ వేశారు. శనివారం ఆయనకు చంద్రబాబు ఫోన్ చేశారు. ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకొని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.