అమరావతిలో విద్యుత్తు పనులు వేగవంతం: మంత్రి గొట్టిపాటి
ABN , Publish Date - Apr 11 , 2026 | 02:54 AM
అమరావతి రాజధాని ప్రాంతంలో విద్యుత్తు మౌలిక వసతుల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు.
అమరావతి, ఏప్రిల్ 10(ఆంధ్రజ్యోతి): అమరావతి రాజధాని ప్రాంతంలో విద్యుత్తు మౌలిక వసతుల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలోని తన చాంబర్‌లో పురపాలక శాఖ మంత్రి నారాయణతో కలిసి విద్యుత్తు పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా, వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మాస్టర్ ప్లాన్‌లో ఎలాంటి మార్పులు చేయకుండా విద్యుత్తు పనులు కొనసాగించాలని కోరారు. ముఖ్యంగా హైటెన్షన్ లైన్ల మార్పిడిపై ఇరు శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి, సమయానికి పనులు పూర్తి చేయాలన్నారు. న్యాయమూర్తులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, అఖిల భారత సర్వీసు అధికారుల నివాసాలకు నిరంతరం విద్యుత్తు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో సీఆర్డీయే కమిషనర్ విజయరామరాజు, సీపీడీసీఎల్ సీఎండీ పుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.