Share News

పడి లేచిన కెరటంలా

ABN , Publish Date - Mar 28 , 2026 | 04:53 AM

ఆంధ్రుల కలల రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ‘ఏపీకి అమరావతే రాజధాని’ అని శనివారం అసెంబ్లీ సాక్షిగా ప్రకటించనుంది.

పడి లేచిన కెరటంలా

  • చెక్కు చెదరని అమరావతి సంకల్పం

  • ఆంధ్రులకు సొంత రాజధాని స్వప్నం

  • తొలుత సమర్థించిన జగన్‌, వైసీపీ

  • ఆనక..అమరావతిపై ఐదేళ్లూ విషం

  • 3 ముక్కలాటతో ఘోర పరిహాసం

  • కూటమి రాకతో తిరిగి జీవం

  • అమరావతిని మరెవరూ

  • కదిలించకుండా చట్టబద్ధత

  • నేడు అసెంబ్లీ వేదికగా తీర్మానం

  • ఆ వెంటనే కేంద్రానికి నివేదిక

  • పార్లమెంట్‌లో ఏపీ పునర్విభజన చట్టసవరణ బిల్లు

రాష్ట్ర విభజన తర్వాత ‘సీమాంధ్ర’... రాజధాని లేని రాష్ట్రంగా మారింది. తెలుగు వారు గర్వించేలా నవీన నగర నిర్మాణానికి నాటి టీడీపీ సర్కారు శ్రీకారం చుట్టింది. ‘మేమూ అమరావతికి అనుకూలమే’ అని మాయ మాటలు చెప్పిన జగన్‌ అధికారంలోకి రాగానే మాట మార్చారు. ‘మూడు ముక్కలాట’ మొదలు పెట్టారు. అమరావతిని అటకెక్కించారు. రాజధాని రైతుల త్యాగాలను గేలి చేశారు. వేలకోట్లతో జరిగిన నిర్మాణాలను పాడుపెట్టారు. అమరావతిపై కక్ష సాధించారు. 2024 ఎన్నికల్లో ‘కూటమి’ అధికారంలోకి రాగానే అమరావతిమళ్లీ ఊపిరి పీల్చుకుంది. ఇంకెప్పుడూ, ఎవ్వరూ అమరావతిని కదిలించకుండా ఒక చట్టబద్ధ రక్షణకు రంగం సిద్ధమైంది. దీనిపై శనివారం అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమై తీర్మానం చేయనుంది.

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ఆంధ్రుల కలల రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ‘ఏపీకి అమరావతే రాజధాని’ అని శనివారం అసెంబ్లీ సాక్షిగా ప్రకటించనుంది. అదే విషయం తీర్మానం చేసి వెంటనే కేంద్రానికి పంపించనుంది. రాష్ట్ర విభజన సందర్భంలో రాజధానిపై చేసిన తీర్మానంలోని అస్పష్టత తొలగనుంది. ఆనాడు.. ‘విభజన కలిగించిన కష్టనష్టాల నుంచి కోలుకునేందుకు, ఏపీని గట్టెక్కించేందుకు విజయవాడ చుట్టుపక్కల రాజధాని ఏర్పాటు చేసుకుంటాం. దానికి అవసరమైన వనరులను సమకూర్చి, సహకరించండి’ అని అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది. అప్పటికి ఇంకా అమరావతి ప్రస్తావన తెరమీదకు రాలేదు. ఆ తర్వాత జీవో 97, గజిట్‌ ద్వారా ఆంధ్రుల రాజధాని అమరావతే అని ప్రభుత్వం ప్రకటించింది.


ఏపీ పునర్విభజన చట్టంలో చేర్చాలని కోరింది. నాడున్న పరిస్థితుల్లో అది చట్టరూపం దాల్చలేదు. అవకాశం కోసం కాచుకున్న వైసీపీ అధినేత జగన్‌ ‘అమరావతే రాజధాని’ అని ఎన్నిలకు ముందు నమ్మబలికి, ఆ తర్వాత మూడు రాజధానులంటూ విధ్వంసక ఆట మొదలుపెట్టారు. ఆయన ప్రభుత్వం ఉన్న ఐదేళ్లూ అమరావతి నిలువెల్లా విధ్వంసక గాయాలకు గురయింది. ఇప్పుడు ఆరేళ్ల తర్వాత మళ్లీ దిద్దుబాటు మొదలైంది. మరోసారి జగన్‌, ఆయనను మించిన విధ్వంసకులు మరెవరు వచ్చి అమరావతిని కదిలించకుండా చట్టబద్ధమైన చర్యలు ప్రారంభయ్యాయు. ఏపీకి అమరావతే రాజధాని అని శనివారం తీర్మానం చేసేందుకు రాష్ట్ర అసెంబ్లీ సిద్ధమవుతోంది. ఆ తీర్మానం ఆధారంగానే ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలోని సెక్షన్‌ 5లో ‘ఏపీ కొత్త రాజధాని అమరావతి’ అని చేర్చి పార్లమెంట్‌లో చట్టసవరణ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించేందుకు కేంద్రం ఏర్పాట్లు చేసింది. ఈ మహాత్తర దిద్దుబాటు చర్యల కోసం అసెంబ్లీ శనివారం అత్యవసర సమావేశం కాబోతుంది. మళ్లీ మళ్లీ అమరావతి విఽధ్వంసానికి గురికాకుండా చట్టబద్ధమైన రక్షణ కోసం రంగం సిద్ధమవుతోంది. ఈ నేపఽథ్యంలో అసలు అమరావతిపై జరిగిన రాజకీయ, ఆర్థిక దాడి, జగన్‌ ఆడిన మోసపూరిత, విధ్వంసక ఆటలు ఏమిటో తెలిసే ్తనే నేటి అసెంబ్లీ తీర్మానం రాష్ట్ర భవిష్యత్తుకు ఎంత ముఖ్యమో అర్థమవుతుంది.


విభజన నుంచి పురోగమనం దిశగా..

2014లో రాష్ట్ర విభజనపై ఆంధ్రులు తీవ్ర ఆందోళన, ఆవేదనకు గురయ్యారు. తమ ప్రయోజనాలను దెబ్బతీసేలా విభజన చేశారన్న కసి వారిలో నాటుకుంది. ఆ బాధనుంచి బయటపడి నవ్యాంధ్రకు ఓ అద్భుత రాజధాని ఉండాలని నాటి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కొత్తగా ఏర్పాటుచేసుకునే ఏపీ రాజధానికి ఆర్థిక వనరులు కల్పించాలని నాటి ప్రభుత్వం అసెంబ్లీలో 2014 సెప్టెంబరు 4న తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది. ఆ తర్వాత ప్రజల భాగస్వామ్యంతో అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేసింది. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు ఎన్నికలు జరిగిన సమయంలో, ఆ తర్వాత కూడా జగన్‌ పదేపదే ఏపీకి అద్భుత రాజధాని ఉండాలని ప్రకటించారు. రాజధానిని విజయవాడ చుట్టుపక్కల ఏర్పాటు చేయాలని పలు ప్రకటనలు ఇచ్చారు. కనీసం 30వేల ఎకరాలు అయినా రాజధాని కోసం ఉండాలన్నారు. ఇంకా, 2019కి ముందే తాడేపల్లిలో ఇంటి నిర్మాణం చేసుకొన్నారు. ఆ తర్వాత గుంటూరులో జరిగిన వైసీపీ ప్లీనరీలో అమరావతి రాజధానికి జై కొట్టారు. ఇందుకు మద్దతుగానే తాడేపల్లిలో జగన్‌ సొంత నివాసం ఏర్పాటు చేసుకున్నారని ఆయన అనుచరులు, పార్టీ నేతలు ప్రచారం చేశారు. అసెంబ్లీ సాక్షిగా జగన్‌ ప్రతిపక్ష నేత హోదాలో నాటి ఏపీ ప్రభుత్వం రాజధాని ఏర్పాటుకోసం తీసుకున్న చర్యలను 2019 ఎన్నికల వరకు సమర్థించారు. కానీ, అధికారంలోకి వచ్చాకే ఆయన తన అసలు రంగు బయటపెట్టుకున్నారు.


జగన్‌ దృష్టిలో ఏపీ దేశమా? రాష్ట్రమా?

ఏ దేశానికయినా ఎన్ని రాజధానులు ఉంటాయి? ఒక దేశంలో అంతర్భాగంగా ఉండే రాష్ట్రానికి ఎన్ని రాజధానులు ఉంటాయి? ఎల్‌కేజీ పిల్లలను అడిగినా దేశానికి ఒకటే రాజధాని ఉంటుందని చెబుతారు. ఇక దేశంలో అంతర్భాగమైన రాష్ట్రానికీ ఒక్క రాజధానే ఉంటుందని బదులిస్తారు. అదేమిటోగానీ, జగన్‌ ప్రపంచంలో మరెవ్వరూ చేయని విధ్వంసక ఆలోచనలు చేసి నాడు 13 జిల్లాలున్న ఏపీకి మూడు రాజధానులు తీసుకురావాలనుకున్నారు. అన్ని ప్రాంతాలను సమదృష్టితో అభివృద్ధి చేయడాన్ని చేతల్లో చూపలేకపొయిన ఆయన, చివరకు అదే కారణంగా చూపి మూడు రాజధానులు ఏపీకి ఉండాలని పట్టుబట్టి అసెంబ్లీలో బిల్లు తీసుకొచ్చారు. ఒక రాష్ట్రానికి మూడు రాజధానులు ఎందుకు? ఏపీ కన్నా చాలా పెద్దవైనా ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌లకు ఎన్ని రాజధానులు ఉన్నాయి అని ప్రశ్నిస్తే, తలాతోక లేని వాదనలు వినిపించారు. ఆఫ్రికాలోని దే శాలతో పోల్చారు. ప్రజలిచ్చిన ఐదేళ్ల అధికారాన్ని అభివృద్ధికి బదులు, అమరావతి విధ్వంసానికే వాడుతా.. అన్నట్లుగా ఆయన పాలన సాగింది. అమరావతి పరిరక్షణ కోసం పోరుబాటపట్టిన రైతులు, ఉద్యమకారులపై ఉక్కుపాదం మెపారు. చివరకు తన ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదనే దురుద్దేశంతో ఏకంగా నాటి బ్రిటిష్‌ చట్టాలను మళ్లీ అమల్లోకి తీసుకొచ్చిన ఘనత జగన్‌దే. అమరావతి అంటేనే ద్వేషంతో రగిలిపోతూ, విధ్వంసక ఆటలు ఆడారు. ఇందుకు ఆయన, ఆ పార్టీ నేతలు వివిధ సందర్భాల్లో ఇచ్చిన ప్రకటనలే నిదర్శనం.


జగన్‌ మాటల గారడీలు..విధ్వంసకర ప్రకటనలు..

  • 2014 ఎన్నికల సమయంలో..... ‘‘హైదరాబాద్‌ను మించిన మహానగరం ఏపీలో కడతాం. ఎలా కడతామన్నది మా బుర్ర లో నుంచి వ స్తున్న ఆలోచనలో నుంచి కడతాం’ అని జగన్‌ వ్యాఖ్యానించారు.

  • 2014లో ప్రతిపక్షనేతగా, అసెంబ్లీలో మాట్లాడుతూ, ‘విజయవాడలో రాజధాని నగరం ఏర్పాటు చేయడాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం’ అని జగన్‌ అన్నారు. ఆతర్వాత మీడియాతో మాట్లాడుతూ... ‘రాజధానికి కనీసం 30 వేల ఎకరాలయినా ఉండాలి. అదికూడా రాష్ట్రం నడిమధ్యలో ఉండాలి’ అని ఆయన సెలవిచ్చారు.

  • 2019 ఎన్నిక ల్లో అధికారంలోకి వచ్చిన జగన్‌ అదే ఏడాది డి సెంబరులో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మూడు చేతివేళ్లు చూపిస్తూ... ‘బహుశా ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు వస్తాయేమో. ఎగ్జిక్యూటివ్‌ కాపిటల్‌, లెజిస్లేటీవ్‌ కాపిటల్‌, జ్యుడీషియల్‌ కాపిటల్‌. మూడు రాజధానులు రావాల్సిన పరిస్ధితి కనిపిస్తోంది’ అని తెలిపారు.

  • మూడు రాజధానుల బిల్లుపై న్యాయపోరాటం మొదలుకావడం, హైకోర్టు తీర్పు వ్యతిరేకంగా రానున్నదని గ్రహించి 2021, నవంబరు 22న ఆ బిల్లును రద్దుచేసిన సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ.. ‘‘మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించి ఇంతకు ముందు ప్రవేశపెట్టిన బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. మెరుగైన బిల్లుతో తిరిగి సభ ముందుకు వస్తుంది’ అని ప్రకటించారు.


  • 2022లో జగన్‌ మాట్లాడుతూ...విశాఖపట్నమే ఏపీ రాజధాని కాబోతుందని ప్రకటించారు.

  • 2023లో అసెంబ్లీలో జగన్‌ మాట్లాడుతూ..‘రాష్ట్రానికి ఎకనామిక్‌ పవర్‌ హౌస్‌ ఉండాలి. అలాంటి పవర్‌హౌజ్‌ లేకపోతే, అంటే ఓ హైదరాబాద్‌, ఓ బెంగళూరు, చెన్నై వంటి నగరాలు లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు ఎప్పటికీ పెరగవు’ అని తెలిపారు.

  • 2024లో జగన్‌ బాబాయి, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ... ‘‘అన్ని విధాలా అభివృద్ధి చెందిన నగరం హైదరాబాద్‌ను రాజధానిగా కొనసాగించాలన్నది మా ఆలోచన’ అని అన్నారు

  • 2025, జనవరిలో వైసీపీ అధినే త మాట్లాడుతూ...‘అంతగా కావాలంటే, నాగార్జున యూనివర్సిటీలోనో, విజయవాడ-గుంటూరు మధ్యనో ఓ 500 ఎకరాలు తీసుకొని అవసరం ఉన్న బిల్డింగులేవో రీజనబుల్‌గా ఏదో ఒక సైజులో కట్టు’ అని ఏపీ ప్రభుత్వానికి సలహాఇచ్చారు.

  • 2025 సెప్టెంబరులో జగన్‌ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ..

  • ‘ 2019కి ఎన్నికలకు ముందు జగన్‌ ఇక్కడ ఇల్లు కట్టారంటే, అమరావతి ఉన్నదనే. రాజధాని అక్కడే (అమరావతి) ఉంది’ అని అన్నారు.


విధ్వంసం ఇలా..

2020 జనవరిలో అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెట్టారు. ఏపీ సర్వతో ముఖాభివృద్ధికి మూడు రాజధానులు అవసరం ఉంటూ తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు. ఆ తర్వాత శాసనమండలిలో బిల్లు ప్రవేశపెట్టేందుకు విఫలయత్నం చేశారు. చివరకు అక్కడ ఆయన పాచిక పారకపోవడంతో ఏకంగా మండలినే రద్దుచేసేందుకు విఫలయత్నం చేశారు. నాడు మంత్రులుగా ఉన్న ఎమ్మెల్సీలను రాజీనామాలు చేయించి ఎంపీలుగా పంపించారు. తన విద్వేషాన్ని, దాడిని కొనసాగించేందుకు అమరావతిపై బుద్ధి పుట్టినప్పుడల్లా విభిన్న ప్రకటనలు చేసి మరింత గందరగోళం సృష్టించారు. మూడు రాజధానుల పేరిట అమరావతి వర్క్‌లను నిలిపివేయించారు. అభివృద్ధిని పూర్తిగా అటకెక్కించారు. అంతిమంగా అమరావతిని శిధిల స్వప్నంగా చూపించే ప్రయత్నం చే శారు.

మోసకారి మాటలతో విధ్వంస పథం..

2019 ఎన్నికలకు ముందు వరకు అమరావతే ఆంధ్రా రాజధాని అంటూ ప్రజలను నమ్మించిన జగన్‌ ముఖ్యమంత్రి పీఠం ఎక్కాక తన అసలు విశ్వరూపాన్ని బయటపెట్టారు. అప్పటి వరకు లోలోన అమరావతి అంటే గూడుకట్టుకుపోయిన కోపం, విద్వేషాన్ని అసెంబ్లీ సాక్షిగా, 2019 డిసెంబరులో తొలిసారి వెళ్లగక్కారు. ఏమో...ఏపీకి మూడు రాజధానులు రావ చ్చేమోనంటూ మూడు వేళ్లు సభలో చూపించారు. అదేరోజు అమరావతి విధ్వంసక చర్యలను ప్రారంభించారు. అక్కడి నుంచి మొదలు 2024లో అధికారాంతం వరకు అమరావతి విద్వేష, విధ్వంసక పనులే కొనసాగించారు.

Updated Date - Mar 28 , 2026 | 04:55 AM