అమరావతి ఉద్యమం ఆగిపోలేదు
ABN , Publish Date - Jul 02 , 2026 | 03:37 AM
రాజధానిపై వైసీపీ అరాచకాన్ని అడ్డుకోవడానికి ఐదేళ్లు సాగించిన అమరావతి ఉద్యమం ఆగిపోలేదు. జగన్‌లాంటి మారీచుడు అమరావతిపై కుట్రలు చేయడానికి ప్రయత్నించిన ప్రతిసారీ దానికి...
‘మారీచుడిని’ అడ్డుకోవటానికి రూపం మారుతుంది
11 సీట్ల నుంచి జనం జీరోకి తెస్తారు: రైతు జేఏసీ
తుళ్లూరు, జూలై 1(ఆంధ్రజ్యోతి): రాజధానిపై వైసీపీ అరాచకాన్ని అడ్డుకోవడానికి ఐదేళ్లు సాగించిన అమరావతి ఉద్యమం ఆగిపోలేదు. జగన్‌లాంటి మారీచుడు అమరావతిపై కుట్రలు చేయడానికి ప్రయత్నించిన ప్రతిసారీ దానికి తగ్గట్టుగా ఉద్యమం రూపం మారుతుంది’ అని అమరావతి రైతు జేఏసీ నేతలు స్పష్టం చేశారు. బుధవారం గుంటూరు జిల్లా మందడంలో వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘జగన్‌రెడ్డి అమరావతిని ఐదేళ్లు నాశనం చేశారు. ఇప్పటికీ విషం చిమ్మే పనిలో ఉన్నారు. కొత్తగా మావిగన్ అంటూ అమరావతిని నామరూపాలు లేకుండా చేయాలనే ఆలోచనతో ఉన్నారు. సీఎం చంద్రబాబు ఆలోచనతో అమరావతికి అంతర్జాతీయ ఖ్యాతి వస్తూండడాన్ని చూడలేక, కక్షతో ఎలాగైనా నాశనం చేయాలని కుట్రలో భాగమే ఈ మావిగన్. అమరావతే రాష్ట్ర ఏకైక రాజధానిగా కేంద్రం పార్లమెంటులో చట్టం చేసింది. దాన్ని కాదని జగన్ మావిగన్ అని మోదీ దగ్గరకు వెళ్తే ఆ క్షణం నుంచే ఆయనకు కౌంట్‌డౌన్ మొదలతుంది. అమరావతిని నాశనం చేయాలనుకునే వారికి రాజధానిలో ఏం పని? రాజధానిపై కుట్రలు చేస్తే సహించం. సంఘటితంగా ఎదుర్కొంటాం’ అని హెచ్చరించారు. సమావేశంలో రైతు జేఏసీ నేతలు బెల్లంకొండ నరసింహారావు, ఆకుల ఉమామహేశ్వరావు, జమ్ముల శ్యాం కిశోర్, అనుమోలు బాలమురళీకృష్ణ, ఉప్పలపాటి సాంబశివరావు, జమ్ముల అనిల్, బెజవాడ రమేశ్, కొండెపాటి బుజ్జి, కట్టా రాజేంద్ర, ఆలూరి శ్రీనివాసరావు, ఇడుపాలపాటి సీతారామయ్య, మహిళా జేఏసీ నేత కంభంపాటి శిరీష తదితరులు పాల్గొన్నారు.