అమరావతిపై జగన్‌ది సైకో కామెడీ
ABN , Publish Date - Apr 03 , 2026 | 05:59 AM
మాజీ సీఎం జగన్‌రెడ్డికి గత ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పినా ఆయన విధ్వంసకర ఆలోచనలో మార్పు రాలేదు. కామెడీ సైకోగా తయారయ్యారు.
ప్రజలు ఆయనను జోకర్‌గా చూస్తున్నారు: మంత్రి అనిత
అనకాపల్లి, ఏప్రిల్ 2(ఆంధ్రజ్యోతి): ‘మాజీ సీఎం జగన్‌రెడ్డికి గత ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పినా ఆయన విధ్వంసకర ఆలోచనలో మార్పు రాలేదు. కామెడీ సైకోగా తయారయ్యారు. ఆయన పిచ్చి పరాకాష్ఠకు చేరినట్టుంది’ అని హోం మంత్రి వంగలపూడి అనిత ధ్వజమెత్తారు. గురువారం అనకాపల్లిలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొల్లు రవీంద్రతో కలసి ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు పార్లమెంటులో అనేక రాష్ర్టాలకు చెందిన పార్టీలు మద్దతు ప్రకటించాయి. ఇటువంటి తరుణంలో అమరావతిపై మాజీ సీఎం జగన్‌రెడ్డి అక్కసు వెళ్లగక్కడం ఆయన నీచ వైఖరిని తెలియజేస్తోంది. ప్లాన్ బీ అంటూ ‘మావిగన్’ను ప్రతిపాదించడం సిగ్గుచేటు. ప్రజలు ఆయనను ఒక జోకర్‌గా చూస్తున్నారు’’ అని మంత్రి అనిత విమర్శించారు.