Share News

అమరావతి భూ సమీకరణ రాష్ట్రానిదే: కేంద్రం

ABN , Publish Date - Feb 04 , 2026 | 06:06 AM

అమరావతి ప్రాంతంలో భూ సమీకరణను ఏపీ ప్రభుత్వం, రాష్ట్ర అధికారులు అమలు చేస్తున్నారని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ తెలిపారు.

అమరావతి భూ సమీకరణ రాష్ట్రానిదే: కేంద్రం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి): అమరావతి ప్రాంతంలో భూ సమీకరణను ఏపీ ప్రభుత్వం, రాష్ట్ర అధికారులు అమలు చేస్తున్నారని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ తెలిపారు. భూ సమీకరణ ఫలితాలపై కానీ, రైతుల ఫిర్యాదులపై కానీ కేంద్రం ఎలాంటి సమీక్ష లేదా అంచనా నిర్వహించలేదని స్పష్టం చేశారు. మంగళవారం వైసీపీ ఎంపీ మిథున్‌ రెడ్డి లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

Updated Date - Feb 04 , 2026 | 06:06 AM