జ్యుడీషియల్ అకాడమీ ప్రత్యేకతలు ఇవీ..
ABN , Publish Date - Mar 02 , 2026 | 03:34 AM
రాష్ట్ర జ్యుడీషియల్ అకాడమీని 4.83 ఎకారాల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. మొత్తం విస్తీర్ణంలో 31శాతం భవనాలకు, 69 శాతం పచ్చదనం కోసం కేటాయించారు.
ఇంటర్నెట్ డెస్క్: రాష్ట్ర జ్యుడీషియల్ అకాడమీని 4.83 ఎకారాల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. మొత్తం విస్తీర్ణంలో 31శాతం భవనాలకు, 69 శాతం పచ్చదనం కోసం కేటాయించారు. అకాడమీ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.165 కోట్లకు పరిపాలన అనుమతులు ఇచ్చింది. అకడమిక్ బ్లాక్‌ను జీప్లస్-3, హాస్టల్ బ్లాక్‌ను జీప్ల్‌స-8గా నిర్మించనున్నారు. మరో జీప్లస్-3 బ్లాక్‌లో ఇండోర్ స్పోర్ట్స్, అతిథులకు సౌకర్యాలు కల్పిస్తున్నారు. అకాడమీలో ఒకేసారి 120 మంది ట్రైనీ న్యాయమూర్తులకు శిక్షణ ఇవ్వగల సామర్థ్యంతోపాటు 60 మంది ఫ్యాకల్టీ, సిబ్బందికి వసతులు కల్పించేలా భవనాలను నిర్మిస్తున్నారు. హైకోర్టు నుంచి 5.7 కిలోమీటర్ల దూరంలో ఈ అకాడమీ నిర్మాణం చేస్తున్నారు. అడ్మినిస్ట్రేటివ్, అకడమిక్ బ్లాక్‌లో 500 సీట్ల సామర్థ్యంతో ఆడిటోరియం, ఫ్రీ ఫంక్షన్ ఏరియా, 120సీట్లతో కూడిన సెమినాల్ హాల్, 70 సీట్లతో రెండు క్లాస్‌రూమ్‌లు, 70సీట్లతో నమూనా కోర్టుహాలు, 50 సీట్లతో కంప్యూటర్ ల్యాబ్, 60 సీట్లతో ఫోరెన్సిక్ ల్యాబ్, 48 సీట్లతో లైబ్రరీ-రీడింగ్ రూమ్, డైరెక్టర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్, జడ్జీల లాంజ్, ఫ్యాకల్టీ రూమ్, కొలాబరేషన్ రూమ్, హెల్త్ యూనిట్, క్రెచీ సౌకర్యం ఉంటాయి. జీప్లస్-8 అంతస్తులతో కూడిన హాస్టల్ భవనంలో జ్యుడీషియల్ అధికారులు, ట్రైనీలకు వసతి, 98 సీట్లతో టిఫికల్ హాస్టల్ యూనిట్, 5 సూట్ రూమ్‌లు, ప్రతి అంతస్తులో లాంజ్‌స్పేస్, ప్యాంట్రీ, యుటిలిటీ సౌకర్యాలు కల్పించబోతున్నారు. జీప్లస్-3 అంతస్తులతో కూడిన ఇండోర్ స్పోర్ట్స్, రిక్రియేషన్ బ్లాక్‌లో 108 సీట్ల డైనింగ్ హాల్, 100 సీట్ల వీఐపీ డైనింగ్ హాల్, పూర్తి సదుపాయాలతో కిచెన్, స్క్వాష్ కోర్టు, జిమ్, యోగా తదితర మల్టీపర్సస్ హాల్ నిర్మించనున్నారు.
న్యాయమూర్తుల నివాస గృహాల్లో అత్యాధునిక హంగులు
హైకోర్టు న్యాయమూర్తుల కోసం మొత్తం 36 నివాస గృహాలను అత్యాధునిక హంగులతో నిర్మిస్తున్నారు. ఇప్పటికే కొన్ని భవనాల నిర్మాణం పూర్తవడంతో ప్రారంభోత్సవం చేశారు. పంచదనం కోసం కేటాయించిన స్థలంతో కలిపి ఒక్కో బంగ్లా విస్తీర్ణం 18 వేల చదరపు అడుగులు ఉంది. జీప్ల్‌స-1తో నిర్మించిన ఈ భవనంలో విశాలమైన 4 పడక గదులతో పాటు ఆఫీస్ రూమ్, డ్రాయింగ్ హాల్, డైనింగ్ ఏరియా, ఫ్యామిలీ లాంజ్, అధునాతన కిచెన్, ఆటోసెన్సార్ విద్యుత్ సౌకర్యం, జిమ్ రూమ్, మల్టీపర్సస్ హాల్, దేవుడి గది ఉన్నాయి. ప్రధాన భవనం వెలుపల సర్వెంట్ క్వార్టర్, సెక్యూరిటీ గది ఏర్పాటు చేశారు. ప్రారంభోత్సవం అనంతరం న్యాయమూర్తుల గృహ సముదాయంలో కల్పించిన సౌకర్యాలను న్యాయమూర్తులు పరిశీలించారు. నిర్మాణ సంస్థ బీఎస్ఆర్ ఇన్‌ఫ్రా ప్రతినిధులు అక్కడ కల్పించిన అత్యాధునిక సౌకర్యాలను న్యాయమూర్తులకు వివరించారు. కాగా, హైకోర్టు నుంచి 1.2 కిలోమీటర్ల దూరంలో న్యాయమూర్తుల అతిథిగృహం నిర్మాణంకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.69 కోట్లకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది.
