ఏపీ శాశ్వత రాజధాని అమరావతే
ABN , Publish Date - Apr 01 , 2026 | 11:36 PM
ఆంధ్రప్రదేశ శాశ్వత రాజధానిగా అమరాతే ఉంటుందని ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దనరెడ్డి అన్నారు.
ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దనరెడ్డి
అవుకు, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ శాశ్వత రాజధానిగా అమరాతే ఉంటుందని ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దనరెడ్డి అన్నారు. బుధవారం సంగపట్నం గ్రామానికి చేరుకున్న మంత్రి బీసీకి టీడీపీ మండలాధ్యక్షుడు ఉగ్రసేనారెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఎన్టీఆర్ భరోసా లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి మంత్రి బీసీ పింఛన్లు పంపిణీ చేశారు. గ్రామంలో రూ.78లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు, రూ.60లక్షలతో నిర్మిం చిన బీటీ రోడ్డును, చెర్లోపల్లెలో రూ.75లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. మంత్రి బీసీ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు. ఏపీ రాజధాని అమరావతికి లోక్‌సభలో చట్టబద్ధత రావడంపై ఆయన హర్షం వ్యక్తంచేశారు. నాపరాతి గనుల యజమానులు, కార్మికుల కోసం సింగిల్ రాయల్టీని అమలు చేస్తున్నామన్నారు. ఆర్‌అండ్‌బీ ఈఈ శ్రీధర్‌రెడ్డి, డీఈ రెడ్డిగోవిందు, పీఆర్ డీఈ నాగశ్రీనివాసులు, బనగానపల్లె మార్కెట్ చైౖర్మన కాట్రెడ్డి మల్లికార్జునరెడ్డి, నంద్యాల పార్లమెంట్ టీడీపీ ఉపాధ్యక్షుడు మారం పుల్లారెడ్డి, నాయకులు మొట్ల రామిరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, వంగల పరమేశ్వరరెడ్డి, వీరారెడ్డి, అశోక్‌రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, ఐషర్‌బాషా పాల్గొన్నారు.