తొలిసారి అమరావతిలో గణతంత్ర వేడుకలు
ABN , Publish Date - Jan 21 , 2026 | 03:54 AM
నవ్యాంధ్ర కలల రాజధాని అమరావతి గణతంత్ర వేడుకలకు ముస్తాబయింది. ఇప్పటి వరకూ విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో జరుగుతున్న ఈ వేడుకలకు తొలిసారిగా ప్రజా రాజధాని వేదికయింది.
రాయపూడిలో ముస్తాబైన పెరేడ్ గ్రౌండ్
గ్యాలరీలు, శకటాల కోసం అంతర్గత రహదారులు
ఐజీ రాజకుమారి నేతృత్వంలో రక్షక దళాల మాక్‌డ్రిల్
గుంటూరు, జనవరి 20(ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర కలల రాజధాని అమరావతి గణతంత్ర వేడుకలకు ముస్తాబయింది. ఇప్పటి వరకూ విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో జరుగుతున్న ఈ వేడుకలకు తొలిసారిగా ప్రజా రాజధాని వేదికయింది. ఈ నేపథ్యంలో భారీ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాజధాని గ్రామం రాయపూడిలోని ఈ 3, ఈ 4 రోడ్ల మధ్య స్థలంలో పెరేడ్ గ్రౌండ్‌ను రూపొందించారు. వేడుకలకు వచ్చే వీవీఐపీలు, వీఐపీలు, ప్రజల కోసం విడివిడిగా గ్యాలరీలు నిర్మించారు. రక్షక దళాల కవాతుకు, వివిధ ప్రభుత్వ శాఖలు రూపొందించే ప్రగతి రథాల కదలికకు ప్రత్యేకంగా ట్రాక్‌ను, అంతర్గత రోడ్లను నిర్మించారు. పనులన్నీ దాదాపుగా కొలిక్కి రావడంతో మంగళవారం మాక్ డ్రిల్ నిర్వహించారు. దీనిలో రెడ్‌క్రా్‌సతో పాటు కర్ణాటకకు చెందిన పోలీసు దళాలు కూడా పాల్గొనడం విశేషం. ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీ్‌స(ఏపీఎస్‌పీ) ఐజీ బీ.రాజకుమారి నేతృత్వంలో పోలీసులు, ఎన్‌సీసీ క్యాడెట్లకు శిక్షణ నడుస్తోంది. మరోవైపు వివిధ శాఖల ప్రగతి రథాలు వేడుకకు సిద్ధమవుతున్నాయి.