Share News

సీజే బంగ్లా, అడ్వొకేట్‌ చాంబర్స్‌ భవనానికి శంకుస్థాపన

ABN , Publish Date - Apr 17 , 2026 | 05:17 AM

హైకోర్టు వద్ద న్యాయమూర్తుల గృహసముదాయంలో నిర్మిస్తున్న చీఫ్‌ జస్టిస్ (సీజే) బంగ్లాతో పాటు హైకోర్టు ప్రాంగణంలో అడ్వొకేట్‌ చాంబర్స్‌ బిల్డింగ్‌కు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌...

సీజే బంగ్లా, అడ్వొకేట్‌ చాంబర్స్‌ భవనానికి శంకుస్థాపన

  • భూమి పూజ చేసిన చీఫ్‌ జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌

అమరావతి, ఏప్రిల్‌ 16(ఆంధ్రజ్యోతి): హైకోర్టు వద్ద న్యాయమూర్తుల గృహసముదాయంలో నిర్మిస్తున్న చీఫ్‌ జస్టిస్ (సీజే) బంగ్లాతో పాటు హైకోర్టు ప్రాంగణంలో అడ్వొకేట్‌ చాంబర్స్‌ బిల్డింగ్‌కు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌ గురువారం శంకుస్థాపన చేశారు. సహచర న్యాయమూర్తులతో కలిసి భూమి పూజ చేసి శిలఫలకాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, అడ్వొకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌, అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌(ఏఎస్‌జీ) చల్లా ధనంజయ, అడిషనల్‌ అడ్వొకేట్‌ జనరల్‌(ఏఏజీ) సాంబశివ ప్రతాప్‌, పబ్లిక్‌ పాసిక్యూటర్‌ మెండ లక్ష్మీనారాయణ, హైకోర్టు అడ్వొకేట్‌ అసోసియేషన్‌ నూతన అధ్యక్షుడు వాసిరెడ్డి ప్రభునాథ్‌, కార్యవర్గం, అసోసియేషన్‌ పూర్వకార్యవర్గం, సీఆర్‌డీఏ కమిషనర్‌ విజయరామరాజు, న్యాయవాదులు పాల్గొన్నారు.

Updated Date - Apr 17 , 2026 | 05:18 AM