అమరావతికి రూ.6 వేల కోట్లు
ABN , Publish Date - Feb 15 , 2026 | 04:43 AM
మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖకు బడ్జెట్‌లో రూ.14,538 కోట్లు కేటాయించారు. గతేడాది కేటాయించిన రూ.11,252 కోట్లు కంటే 3,286 కోట్లు అధికంగా కేటాయించారు.
మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖకు బడ్జెట్‌లో రూ.14,538 కోట్లు కేటాయించారు. గతేడాది కేటాయించిన రూ.11,252 కోట్లు కంటే 3,286 కోట్లు అధికంగా కేటాయించారు. అమరావతి రాజధాని నిర్మాణానికి గతేడాది రూ.3,200 కోట్లు కేటాయిస్తే.. ఈసారి రూ.6వేల కోట్లు కేటాయించారు. తాగునీటి సరఫరా కోసం ఏఐఐబీ రుణాలకు రాష్ట్ర వాటాగా రూ.205 కోట్లు కేటాయించారు. మున్సిపల్ వార్డ్ సెక్రటరీ్‌సకు రూ.1397 కోట్లు, మున్సిపాలిటీ/కార్పొరేషన్ల ఏర్పాటుకు రూ.1265.73 కోట్లు, అన్న క్యాంటీన్లకు రూ.50 కోట్లు, మున్సిపల్ పాఠశాలల్లో మౌలిక వసతులకు రూ.10 కోట్లు కేటాయించారు.