రాజధాని నిర్మాణాలు చకచకా
ABN , Publish Date - May 08 , 2026 | 04:18 AM
ఒకే చోటు... రెండు చిత్రాలు! చిట్టడివి మధ్యలో శిథిల భవనాలను తలపించే దైన్యం మొదటిది! సరికొత్త హంగులతో చకచకా సిద్ధమవుతున్న నవ నిర్మాణాల సొగసు రెండోది!
నాడు, నేడు
ఒకే చోటు... రెండు చిత్రాలు! చిట్టడివి మధ్యలో శిథిల భవనాలను తలపించే దైన్యం మొదటిది! సరికొత్త హంగులతో చకచకా సిద్ధమవుతున్న నవ నిర్మాణాల సొగసు రెండోది! అప్పటికీ, ఇప్పటికీ కాలావధిలో తేడా... 20 నెలలు మాత్రమే! ఇవి రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న ప్రధాన కార్యదర్శుల నివాస బంగళాలు. 2019లో జగన్ అధికారంలోకి రాగానే రాజధాని నిర్మాణాలను ఎక్కడికక్కడ ఆపి వేశారు. దీంతో అమరావతి ప్రాంతమంతా అడవిలా మారిపోయింది. ఆయా నిర్మాణాలు అనాథల్లా మారిపోయాయి. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజధాని పనులకు శ్రీకారం చుట్టింది. అడ్డదిడ్డంగా పెరిగిన పిచ్చి చెట్లను తొలగించేందుకే కొన్ని నెలలు పట్టింది. ఆ తర్వాత భవన నిర్మాణాలను శరవేగంగా కొనసాగిస్తున్నారు. దీంతో ఆ ప్రాంత ముఖ చిత్రమే మారుతోంది.