రాష్ట్ర ప్రగతికి కీలక మైలురాయి: మాధవ్
ABN , Publish Date - Apr 02 , 2026 | 04:53 AM
రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ధన్యవాదాలు తెలిపారు.
అమరావతి, ఏప్రిల్ 1(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ధన్యవాదాలు తెలిపారు. ఇది రాష్ట్ర ప్రగతికి కీలక మైలురాయిగా నిలుస్తుందన్నారు. రాష్ట్ర విభజన జరిగి పన్నెండేళ్లవుతున్నా రాజధాని విషయంలో ఉన్న గందరగోళానికి ముగింపు పలకడం సంతోషకరమని పేర్కొన్నారు. తద్వారా రాష్ట్రంలో పెట్టుబడులు పెరగడంతోపాటు యువతకు ఉపాధి లభిస్తుందన్నారు. రాష్ట్ర ప్రజలు కూటమిపై విశ్వాసం ఉంచినందుకు బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు ఈ రోజు ప్రజల్లో సంతోషాన్ని నింపాయని వ్యాఖ్యానించారు.
జగన్ వెన్నులో వణుకు: మంత్రి సత్యకుమార్
తన దుష్ట, విధ్వంసకర ఆలోచనలకు విరుద్ధంగా రాజధాని అమరావతికి పార్లమెంట్ ద్వారా చట్టబద్ధత లభిస్తున్న తరుణంలో మాజీ సీఎం జగన్ వెన్నులో వణుకు పుట్టిందని మంత్రి సత్యకుమార్ ఎద్దేవా చేశారు. నిరాశానిస్పృహలకు లోనై రాజధానిపైన, సీఎం చంద్రబాబుపైన అవాకులు, చవాకులు, అసంబద్ధ వ్యాఖ్యలు చేసి తన రాజకీయ దిగజారుడుతనాన్ని జగన్ వెల్లడించారని ఎద్దేవా చేశారు.