అమరావతికి చట్టబద్ధతపై ‘అప్సా’ సంబరాలు
ABN , Publish Date - Apr 03 , 2026 | 05:55 AM
పార్లమెంటులో అమరావతికి చట్టబద్ధతపై రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగులు సంబరాలు చేసుకున్నారు. మూడవ బ్లాకు వద్ద ఉద్యోగులు కేక్ కట్ చేశారు.
సచివాలయం 3వ బ్లాక్ వద్ద ఉద్యోగుల కేక్ కటింగ్
అమరావతి, ఏప్రిల్ 2(ఆంధ్రజ్యోతి): పార్లమెంటులో అమరావతికి చట్టబద్ధతపై రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగులు సంబరాలు చేసుకున్నారు. మూడవ బ్లాకు వద్ద ఉద్యోగులు కేక్ కట్ చేశారు. మహిళా ఉద్యోగులు ప్రమిదలు వెలిగించారు. ‘మన రాజధాని-మన అమరావతి’, ‘ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతి’, ‘రాజధాని ఒక్కటే అమరావతి’, ‘జై అమరావతి... జైజై అమరావతి’ అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగుల సంఘం(అప్సా) ఉపాధ్యక్షుడు పవన్ కుమార్, కార్యదర్శి నాపా ప్రసాద్, మహిళా ఉపాధ్యక్షురాలు లక్ష్మీకుమారి, అప్సా మాజీ అధ్యక్షుడు, మున్సిపల్ శాఖ ఓఎస్డీ యూ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మీడియాతో మాట్లాడారు.