Share News

ఎస్‌ఆర్‌ఎంలో ‘అమరరాజా’ సెంటర్‌ విస్తరణ

ABN , Publish Date - Mar 26 , 2026 | 03:35 AM

అమరావతిలోని ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో ఉన్న ఎనర్జీ స్టోరేజ్‌ డివైజెస్‌ సెంటర్‌ను విస్తరించేందుకు అమరరాజ బ్యాటరీస్‌ లిమిటెడ్‌ ముందుకొచ్చింది.

ఎస్‌ఆర్‌ఎంలో ‘అమరరాజా’ సెంటర్‌ విస్తరణ

తుళ్లూరు, మార్చి 25(ఆంధ్రజ్యోతి): అమరావతిలోని ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో ఉన్న ఎనర్జీ స్టోరేజ్‌ డివైజెస్‌ సెంటర్‌ను విస్తరించేందుకు అమరరాజ బ్యాటరీస్‌ లిమిటెడ్‌ ముందుకొచ్చింది. వర్సిటీ కేంద్రంగా 2020లో ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో పరిశోధనలను విస్తృతపర్చడంతో పాటు ప్రస్తుత పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు సమాయత్తమవుతోంది. ఈ మేరకు ఏపీ ఎస్‌ఆర్‌ఎం వర్సిటీ ప్రొఫెసర్లు సిద్ధం చేసిన ప్రతిపాదనలపై సమీక్షించింది. బుధవారం వర్సిటీకి వచ్చిన అమరరాజా బృందం ఎనర్జీ స్టోరేజీ సెంటర్‌ నిర్వహణ బాధ్యతల్లో ఉన్న ప్రొఫెసర్లతో సమావేశమైంది. రెండో దశ కింద కేంద్రాన్ని అభివృద్ధి చేసే అంశాలపై చర్చించారు.

Updated Date - Mar 26 , 2026 | 03:35 AM