అమరజీవి విగ్రహావిష్కరణకు
ABN , Publish Date - Mar 15 , 2026 | 04:41 AM
‘అమరజీవి పొట్టి శ్రీరాముల ప్రాణత్యాగం వృథా కానివ్వబోం. ఆంధ్రజాతి కోసం ఆయన చేసిన పోరాట స్ఫూర్తిని భావితరాలకు అందించాలన్న లక్ష్యంతోనే పొట్టి శ్రీరాముల స్మతివనం ఏర్పాటు చేస్తున్నాం’ అని మంత్రి సవిత తెలిపారు.
పకడ్బందీ ఏర్పాట్లు: మంత్రి సవిత
తుళ్లూరు, మార్చి 14(ఆంధ్రజ్యోతి): ‘అమరజీవి పొట్టి శ్రీరాముల ప్రాణత్యాగం వృథా కానివ్వబోం. ఆంధ్రజాతి కోసం ఆయన చేసిన పోరాట స్ఫూర్తిని భావితరాలకు అందించాలన్న లక్ష్యంతోనే పొట్టి శ్రీరాముల స్మతివనం ఏర్పాటు చేస్తున్నాం’ అని మంత్రి సవిత తెలిపారు. రాజధాని అమరావతిలోని తుళ్లూరులో అమరజీవి పొట్టి శ్రీరాములు స్మృతి వనంలో ఏర్పాటు చేస్తున్న కాంస్య విగ్రహ ఏర్పాటు పనులను మంత్రి సవిత శనివారం పరిశీలించారు. విగ్రహ ఏర్పాటు పనులు ఎంతవరకూ వచ్చాయో అడిగి తెలుసుకున్నారు. ఆదివారం మధ్యాహ్నానికే విగ్రహాన్ని సిద్థం చేయాలని ట్రస్టు సభ్యులకు సూచించారు. అనంతరం స్మృతివనం సమీపంలో ఏర్పాటు చేస్తున్న సభాస్థలి ఏర్పాట్లను వపరిశీలించారు. ‘రాజధాని అమరావతిలో 6.8 ఎకరాల్లో అమరజీవి పొట్టి శ్రీరాములు స్మృతివనం ఏర్పాటు చేస్తున్నాం. స్టాచ్యూ ఆఫ్ శాాక్రిఫైస్ పేరుతో 58 అడుగుల ఎత్తు మేర అమరజీవి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 16న సీఎం చంద్రబాబు ఆవిష్కరించబోతున్నారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్, పలువురు మంత్రులు పాల్గొంటారు’ అని మంత్రి తెలిపారు.