Share News

గురుకుల హాస్టల్‌లో పైశాచికం

ABN , Publish Date - Feb 22 , 2026 | 05:01 AM

కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని ఓ గురుకుల వసతి గృహంలో శుక్రవారం అర్ధరాత్రి విద్యార్థిపై ముగ్గురు తోటి విద్యార్థులు...

గురుకుల హాస్టల్‌లో పైశాచికం

  • బాలుడిపై అర్ధరాత్రి తోటి విద్యార్థుల లైంగిక దాడి

ఆలూరు, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని ఓ గురుకుల వసతి గృహంలో శుక్రవారం అర్ధరాత్రి విద్యార్థిపై ముగ్గురు తోటి విద్యార్థులు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ దాడితో విద్యార్థికి రక్తస్రావం కావడంతో పాటు నొప్పి భరించలేక తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి జరిగిన విషయం చెప్పాడు. జరిగిన పైశాచిక దాడిని వివరిస్తూ విద్యార్థి బో రున విలపించాడు. ఇలాంటి ఘటన జరగడం బాధాకరమని, ఈ ఘటనకు బాధ్యులైన ముగ్గురికి టీసీలు ఇచ్చి పంపించామని ప్రిన్సిపాల్‌ తెలిపారు.

Updated Date - Feb 22 , 2026 | 05:02 AM