Share News

పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

ABN , Publish Date - Apr 26 , 2026 | 11:38 PM

మండల కేంద్రమైన వెల్దుర్తి జిల్లా పరిషత బాలుర పాఠశాలలో 1995-96 పదో తరగతి బ్యాచకు చెందిన పూర్వవిద్యార్థులు 30 సంవత్సరాల తరువాత ఆదివారం ఒకచోట చేరి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.

పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
వెల్దుర్తిలో గురువులతో పూర్వవిద్యార్థులు

వెల్దుర్తి, ఏప్రిల్‌ 26(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రమైన వెల్దుర్తి జిల్లా పరిషత బాలుర పాఠశాలలో 1995-96 పదో తరగతి బ్యాచకు చెందిన పూర్వవిద్యార్థులు 30 సంవత్సరాల తరువాత ఆదివారం ఒకచోట చేరి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. మిత్రులందరూ వారు చదువుకున్న తరగతి గదులకు వెళ్లి నాటి రోజులను గుర్తుచేసుకున్నారు. అలాగే ఒకరి యోగక్షేమాలు ఒకరు తెలుసుకున్నారు. చదువు చెప్పిన గురువులను శేషఫణిశర్మ, రఫిక్‌, జంబులన్న, సుబ్బయ్య, అల్లబకా్‌షలను సన్మానించారు. ఆడపడుచులకు సారె (చీర, కుంకుమ, పసుపు)అందజేశారు. పాఠశాలకు ఎయిర్‌ఫోర్ట్‌ కుర్చీలను విరాళంగా ఇచ్చారు. పాఠశాల అభివృద్ధికి సహకారం అందిస్తామన్నారు. నిర్వాహకులు రాజశేఖర్‌, నబిరసూల్‌, రమేశ, బడేసాహెబ్‌, మస్తాన, మద్దిలే టి, స్వరూప, శారద, సుజాత, రేణుఖ, త్రివేణి తదితరులున్నారు.

జొన్నగిరి జడ్పీ హైస్కూల్‌లో..

తుగ్గలి: మండల పరిధిలోని జొన్నగిరి జిల్లా పరిషత హై స్కూల్‌లో 1993-98 వరకు 6 నుంచి 10వ తరగతి వరకు కలిసి చదువుకున్న విద్యార్థుల సమ్మేళనం ఆదివారం నిర్వహించారు. దాదాపు 29 ఏళ్ల తరువాత కలుసుకొని నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఒకరినొకరు ఆలింగనాలు చేసుకొని ఎంతో ఆనందంగా గడిపారు. తమవంతుగా పాఠశాల రుణం తీర్చుకునేందుకు రూ.2లక్షలతో నిర్మించిన నూతన స్టేజీని ఆదివారం ప్రారంభించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. చదువులు చెప్పిన గురువులు ఎల్‌ఎల్‌ఎన ప్రసాద్‌, పార్వతిలతో పాటు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజారామ్మోహనలను హాస్టల్‌ వార్డెన జయన్నలను పూర్వ విద్యార్థులు సత్కరించారు. పాఠశాలకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Apr 26 , 2026 | 11:38 PM