ఆలమట్టికి కొనసాగుతున్న వరద
ABN , Publish Date - Jul 11 , 2026 | 03:59 AM
ఎగువన మహారాష్ట్ర, కర్ణాటకల్లో భారీవర్షాల కారణంగా ఆలమట్టి డ్యాంకు వరద కొనసాగుతోంది. శుక్రవారం 1,31,940 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది.
46 టీఎంసీల నిల్వ.. తుంగభద్రకూ ప్రవాహ ఉధృతి
పోలవరం స్పిల్‌వే నుంచి 1,15,480 క్యూసెక్కులు
బళ్లారి/పోలవరం/అచ్చంపేట/విజయపురి సౌత్, జూలై 10 (ఆంధ్రజ్యోతి): ఎగువన మహారాష్ట్ర, కర్ణాటకల్లో భారీవర్షాల కారణంగా ఆలమట్టి డ్యాంకు వరద కొనసాగుతోంది. శుక్రవారం 1,31,940 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. దీంతో డ్యాంలో నీటి నిల్వ 46 టీఎంసీలకు చేరింది. గడచిన 48 గంటల్లోనే 23 టీఎంసీల నీరు డ్యాంలోకి రావడం విశే షం. అలాగే తుంగభద్ర జలాశయానికి కూడా వరద కొనసాగుతోంది. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు 41,499 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. జలాశయంలో 1597.95 అడుగుల వద్ద 18.991 టీఎంసీల నిల్వ నమోదైంది. ఎగువ ప్రాంతంలోని తుంగ డ్యాం నుంచి 21వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఈనీరు తుంగభద్ర డ్యాంకు చేరుతోంది. ఇక జూరాల, శ్రీశైలంలోకి చుక్క నీరు కూడా రావడం లేదు. నాగార్జున సాగర్ డ్యాం నీటిమట్టం శుక్రవారం 513.80 అడుగులు ఉంది. ఇది 138.21 టీఎంసీలకు సమానం. మ రోవైపు.. ఉపనదులు పొంగడంతో రెండ్రోజులుగా పెరు గుతూ వచ్చిన గోదావరి నీటిమట్టం శుక్రవారం స్పల్పం గా తగ్గింది. మంజీర, ప్రవర, సీలేరు, శబరి జలాలు కలుస్తుండడంతో నీరు ఎరుపువర్ణం సంతరించుకుంది.