Share News

నీతి ఆయోగ్‌ ర్యాంకింగ్‌లో అల్లూరి జిల్లా టాప్‌

ABN , Publish Date - Jul 13 , 2026 | 03:38 AM

నీతి ఆయోగ్‌ అమలు చేస్తున్న ఆకాంక్షిత జిల్లాల కార్యక్రమంలో భాగంగా...మారుమూల గిరిజన పల్లెల్లో మౌలిక సదుపాయాల కల్పనలో అల్లూరి సీతారామరాజు జిల్లా ముందంజలో ఉందని..

నీతి ఆయోగ్‌ ర్యాంకింగ్‌లో అల్లూరి జిల్లా టాప్‌

  • మౌలిక వసతుల కల్పనలో దేశంలోనే ప్రథమ స్థానం: కలెక్టర్‌

పాడేరు, జూలై 12 (ఆంధ్రజ్యోతి): నీతి ఆయోగ్‌ అమలు చేస్తున్న ఆకాంక్షిత జిల్లాల కార్యక్రమంలో భాగంగా...మారుమూల గిరిజన పల్లెల్లో మౌలిక సదుపాయాల కల్పనలో అల్లూరి సీతారామరాజు జిల్లా ముందంజలో ఉందని, దీంతో నీతి ఆయోగ్‌ ర్యాంకింగ్‌లో జిల్లాకు దేశంలో ప్రథమ స్థానం దక్కిందని కలెక్టర్‌ టి.నిషాంతి వెల్లడించారు. మారుమూల గిరిజన పల్లెల్లో రోడ్లు, తాగునీరు, విద్య, వైద్యం వంటి సౌకర్యాలు కల్పించడంలో జిల్లా యంత్రాంగం తగిన కృషి చేసిందని తెలిపారు. ఇదే స్ఫూర్తితో మరింత మెరుగైన ఫలితాలు సాధించి, జిల్లాను అగ్రగామిగా నిలుపుతామని కలెక్టర్‌ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Updated Date - Jul 13 , 2026 | 03:39 AM