డోలీలో మృతదేహం తరలింపు
ABN , Publish Date - Jun 21 , 2026 | 05:57 AM
అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెంకొత్తవీధి మండలం అమ్మవారి ధారకొండ గ్రామానికి చెందిన ముర్ల ఎర్రయ్య అనారోగ్యంతో మృతి చెందాడు.
ఇంటర్నెట్ విభాగం: అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెంకొత్తవీధి మండలం అమ్మవారి ధారకొండ గ్రామానికి చెందిన ముర్ల ఎర్రయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. రహదారి సక్రమంగా లేకపోవడం వల్ల చిమ్మ చీకట్లో, సెల్‌ఫోన్‌ల టార్చ్‌లైట్ల వెలుతురులో శుక్రవారం రాత్రి డోలీ మోత ద్వారా ఐదు కిలోమీటర్లు మృతదేహాన్ని బంధువులు మోసుకెళ్లారు.
- సీలేరు, ఆంధ్రజ్యోతి