Share News

అల్లు అర్జున్‌ పర్యటనలో పోలీసుల అతి!

ABN , Publish Date - Aug 10 , 2026 | 03:43 AM

సినీ నటుడు అల్లు అర్జున్‌ విశాఖ పర్యటన సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరు చర్చనీయాంశమైంది. పోర్టు ఆస్పత్రి సమీపంలో నిర్మించిన ఇనార్బిట్‌ మాల్‌లో ‘ఏఏఏ’ సినీ మల్టీప్లెక్స్‌ను ప్రారంభించేందుకు..

అల్లు అర్జున్‌ పర్యటనలో పోలీసుల అతి!

  • సీఎం స్థాయిలో భారీ బందోబస్తు ఏర్పాట్లు

విశాఖపట్నం, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): సినీ నటుడు అల్లు అర్జున్‌ విశాఖ పర్యటన సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరు చర్చనీయాంశమైంది. పోర్టు ఆస్పత్రి సమీపంలో నిర్మించిన ఇనార్బిట్‌ మాల్‌లో ‘ఏఏఏ’ సినీ మల్టీప్లెక్స్‌ను ప్రారంభించేందుకు అల్లు అర్జున్‌ నగరానికి రాగా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఇనార్బిట్‌ మాల్‌ పరిసరాల్లో బారికేడ్లతో రోడ్లను మూసివేశారు. కైలాసపురం నుంచి నరసింహనగర్‌ వెళ్లే రోడ్డు, పోర్టు క్వార్టర్స్‌ నుంచి హైవే వచ్చే రోడ్డును కూడా మూసివేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అల్లు అర్జున్‌ పర్యటనకు సీఎం స్థాయి బందోబస్తు ఏర్పాట్లు చేశారని పోలీస్‌ అధికారులే చర్చించుకోవడం గమనార్హం. సీపీ పర్యవేక్షణలో డీసీపీ ఆధ్వర్యంలో ఏడీసీపీలు, ఏసీపీలు, సీఐలతోపాటు వందల సంఖ్యలో పోలీసులను బందోబస్తు కోసం కేటాయించారు. హైదరాబాద్‌ సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు.

Updated Date - Aug 10 , 2026 | 03:44 AM