నీటి దోపిడీ ఆరోపణలు విడ్డూరం: సోమిరెడ్డి
ABN , Publish Date - Jan 05 , 2026 | 04:48 AM
సముద్రంలోకి వెళ్లే నీటిని ఏపీ దోచుకుంటోందని, తెలంగాణకు చెందిన బీఆర్‌ఎస్ విమర్శించటం విడ్డూరంగా ఉందని మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా...
నెల్లూరు(వైద్యం), జనవరి 4(ఆంధ్రజ్యోతి): సముద్రంలోకి వెళ్లే నీటిని ఏపీ దోచుకుంటోందని, తెలంగాణకు చెందిన బీఆర్‌ఎస్ విమర్శించటం విడ్డూరంగా ఉందని మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం నెల్లూరులో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 300 టీఎంసీల నీరు సమద్రంలో కలిసిపోతున్నదని, ఈ నీటిని ఆంధ్ర వాళ్లు వాడుకుంటే సహించబోమని బీఆర్‌ఎస్ నేత హరీష్ రావు అనటం సిగ్గుచేటన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సముద్రంలో కలిసే నీటిని ఆంధ్రవాళ్లు వినియోగించుకోవద్దనటం కరెక్టు కాదన్నారు.