లిక్కర్ సొమ్ముతో జగన్ హవాలా సామ్రాజ్యం
ABN , Publish Date - Jun 25 , 2026 | 04:04 AM
మద్యం కుంభకోణానికి సంబంధించిన హవాలా వ్యవహారంపై ఈడీ చేపట్టిన చర్య లు రాష్ట్రాన్ని దిగ్ర్భాంతికి గురి చేస్తున్నాయని, లిక్కర్ పేరుతో దోచుకున్న ...
నీలాయపాలెం విజయ్‌కుమార్
అమరావతి, జూన్ 24 (ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణానికి సంబంధించిన హవాలా వ్యవహారంపై ఈడీ చేపట్టిన చర్య లు రాష్ట్రాన్ని దిగ్ర్భాంతికి గురి చేస్తున్నాయని, లిక్కర్ పేరుతో దోచుకున్న సొమ్ముతో జగన్ ఏకంగా ఒక హవాలా సామ్రాజ్యాన్నే నడిపారని ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్‌కుమార్ అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.ప్రజల సొమ్ముతో అక్రమార్కులు చేసిన అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయని, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కొడుకు సునీల్ కుమార్ ఇంట్లో రూ.94.5 లక్షల రోలెక్స్ వాచ్ దొరికిందంటే ఏ స్థాయిలో ప్రజల సొమ్మును దుర్వినియోగం చేశారో అర్థమవుతుందని పేర్కొన్నారు. వాచీలే ఈ రేంజ్‌లో ఉంటే వారు వాడే కార్లు, ఇతర వస్తువుల ఎన్ని కోట్ల విలువ చేస్తాయో అంతుచిక్కకుండా ఉందని అన్నారు.