Share News

నీరు-చెట్టు బిల్లులన్నీ క్లియర్‌: మంత్రి పయ్యావుల

ABN , Publish Date - Jan 12 , 2026 | 06:48 AM

నీరు-చెట్టు పథకం బిల్లులన్నీ చెల్లించేశామని ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్‌ చెప్పారు.

నీరు-చెట్టు బిల్లులన్నీ క్లియర్‌: మంత్రి పయ్యావుల

అమరావతి, జనవరి 11(ఆంధ్రజ్యోతి): నీరు-చెట్టు పథకం బిల్లులన్నీ చెల్లించేశామని ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్‌ చెప్పారు. ప్రస్తుతం తమశాఖ వద్ద ఆ బిల్లులేవీ పెండింగ్‌లో లేవన్నారు. ఈ అంశంపై ఆదివారం సంబంధిత శాఖలతో సమీక్షా సమావేశం నిర్వహించినట్టు తెలిపారు. ఇప్పటివరకు రూ.800 కోట్ల నీరు-చెట్టు బిల్లులు చెల్లించామని, ఇంకా రూ.40 కోట్ల బిల్లులు జలవనరుల శాఖ వద్ద పెండింగ్‌లో ఉన్నట్టు తెలిపారు. జీఎస్టీ నెంబర్‌ లేకుండా ఉన్న బిల్లులపై ఎలా ముందుకెళ్లాలనే అంశంపై అధికారులు దిశానిర్దేశం చేస్తారన్నారు.

Updated Date - Jan 12 , 2026 | 06:49 AM