Share News

రామతీర్థం బాధ్యుల్ని శిక్షించాలి

ABN , Publish Date - Feb 09 , 2026 | 03:53 AM

జగన్‌ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వంలో జరిగిన రామతీర్థం శ్రీరాముడి విగ్రహ శిరచ్ఛేదానికి బాధ్యుల్ని గుర్తించి చట్టపరంగా...

రామతీర్థం బాధ్యుల్ని శిక్షించాలి

  • సీఎంకు అఖిల భారత హిందూ మహాసభ లేఖ

అమరావతి, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి): జగన్‌ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వంలో జరిగిన రామతీర్థం శ్రీరాముడి విగ్రహ శిరచ్ఛేదానికి బాధ్యుల్ని గుర్తించి చట్టపరంగా శిక్షించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు అఖిల భారత హిందూ మహాసభ విజ్ఞప్తి చేసింది. డిసెంబరు 2020లో జరిగిన అపచారాన్ని గుర్తు చేస్తూ.. ఆ ఘటన కోట్లాది మంది హిందువుల్ని తీవ్ర ఆందోళనకు గురి చేసిందని లేఖలో హిందూ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి జీవీఆర్‌ శాస్త్రి ఆవేదన వ్యక్తం చేశారు. మహా సంప్రోక్షణ, యాగాల ద్వారా ఆలయ సంప్రోక్షణ చేయాల్సి ఉందన్నారు.

Updated Date - Feb 09 , 2026 | 03:53 AM