అర్హులందరికీ ప్రభుత్వ ఫలాలు అందాలి : మంత్రి ఫరూక్
ABN , Publish Date - Aug 14 , 2026 | 12:48 AM
knl news
నంద్యాల రూరల్, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి) : అర్హులందరికీ ప్రభుత్వ ఫలాలు అందేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ అధికారులను ఆదేశించారు. గురువారం టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాదర్బార్‌కు వచ్చిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. ప్రభుత్వం పేద, బడుగు, బలహీన వర్గాలను దృష్టిలో ఉంచుకొని అనేక పథకాలను ప్రవేశపెట్టిందని, ప్రభుత్వ ఫలాలు అర్హులకు చేరకుంటే అధికారులే బాధ్యత వహించాలని పేర్కొన్నారు.
భవనాలకు మరమ్మతులు చేయించండి
నంద్యాల రూరల్ : పట్టణంలోని తెలుగుగంగ కార్యాలయ భవనాలకు మరమ్మతులు చేయించాలని కార్యాలయ సిబ్బంది మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ను కోరారు. గురువారం టీడీపీ కార్యాలయంలో మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. తెలుగుగంగ కార్యాలయ ప్రస్తుత పరిస్థితిని, అత్యవసరంగా చేపట్టాల్సిన మరమ్మతులను వివరించారు. భవన నిర్వహణ లేకపోవడంతో ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలిపారు. మంత్రి స్పందిస్తూ అధికారులతో మాట్లాడి భవన మరమ్మతులను చేయిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది అర్జున్‌నాయక్, ప్రసాద్, నాగమల్లేశ్వరరావు, త్రిలోచన్, బాబు, వెంకటన్న పాల్గొన్నారు.