Share News

నేడు రామాలయానికి శంకుస్థాపన

ABN , Publish Date - May 03 , 2026 | 04:57 AM

పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పెదపేట రామాలయ పునఃనిర్మాణానికి ఆదివారం ఉదయం 7.14 గంటలకు డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు, రమాదేవి దంపతులు శంకుస్థాపన చేయనున్నారు.

నేడు రామాలయానికి శంకుస్థాపన

  • ఆకివీడులో భారీ బందోబస్తు.. సీసీ కెమెరాల ఏర్పాటు

  • ‘నేడు చలో ఆకివీడు’కు రెండు వర్గాల పిలుపుపై ఉత్కంఠ

ఆకివీడు, మే 2(ఆంధ్రజ్యోతి): పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పెదపేట రామాలయ పునఃనిర్మాణానికి ఆదివారం ఉదయం 7.14 గంటలకు డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు, రమాదేవి దంపతులు శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ఏలూరు రేంజ్‌ పరిధిలోని 600 పోలీసులతో ప్రధాన రహదారులపై గస్తీ నిర్వహిస్తున్నారు. అనుమానితులపై ఇప్పటికే నిఘా పెట్టారు. పెదపేట చుట్టూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. రఘురామకృష్ణరాజుకు మద్దతుగా ఆలయ నిర్మాణ శంకుస్థాపనకు తరలి రావాలని హిందూ షెడ్యూల్‌ కులాల పరిరక్షణ సమితి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. మరోవైపు ‘గొంతెనమ్మ గుడి పున:నిర్మాణం.. ఆరు గంటల 30 నిమషాలకు.. చలో ఆకివీడు’ అంటూ ఎంఆర్‌ఎ్‌సఎస్‌ నేతల పేరిట సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో రామాలయ పునఃనిర్మాణాన్ని ప్రశాంతంగా నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకున్నారు.

Updated Date - May 03 , 2026 | 05:03 AM