‘పశ్చిమ’లో ఎయిర్‌పోర్ట్ అథారిటీ బృందం పర్యటన
ABN , Publish Date - May 22 , 2026 | 05:14 AM
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండల పరిధిలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి ప్రతిపాదిత ప్రాంతాన్ని ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) చెన్నై ప్రాంతీయ కార్యాలయ బృందం..
వీఆర్‌గూడెం, జగ్గన్నపేటలో ప్రతిపాదిత స్థల పరిశీలన
తాడేపల్లిగూడెం రూరల్, మే 21(ఆంధ్రజ్యోతి): పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండల పరిధిలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి ప్రతిపాదిత ప్రాంతాన్ని ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) చెన్నై ప్రాంతీయ కార్యాలయ బృందం గురువారం పర్యటించింది. ఆర్.దివాకర్ (జేజీఎం), ఎస్‌హెచ్.మంజు భరద్వాజ్ (ఏజీఎం), ఎస్‌హెచ్ సునీల్‌కుమార్ (డీజీఎం), ఎస్‌హెచ్ అశ్వినికుమార్ (ఏజీఎం), ఎస్‌హెచ్ రోహిత్ కుమార్ (మేనేజర్), ఎస్‌హెచ్ అమన్ చిప్పా (మేనేజర్) జగ్గన్నపేట, వెంకట్రామన్నగూడెం గ్రామాల్లో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివా్‌సతో కలిసి ప్రతిపాదిత స్థలాలను పరిశీలించారు. జగ్గన్నపేట, వెంకట్రామన్నగూడెం గ్రామాల్లో 1200 ఎకరాల ప్రతిపాదిత ప్రాంతంలో ఎతైన కట్టడాలు, అనుకూలతలు పరిశీలించారు. వారి వెంట ఇన్‌చార్జ్ ఆర్డీవో ప్రవీణ్‌కుమార్ రెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గీతాంజలి, తహసీల్దార్ రాజరాజేశ్వరి ఉన్నారు.