రోడ్డుపై విమానం... లారీపై రైలింజన్
ABN , Publish Date - Jul 19 , 2026 | 04:35 AM
ఆకాశంలో ఎగిరే విమానం రోడ్డుపై దర్శనమిస్తే... పట్టాలపై వెళ్లాల్సిన రైలు లారిపై కనపడితే... ఇదుగో ఇలా ఉంటుంది. రాజమహేంద్రవరం వైపు నుంచి వైజాగ్ వైపు..
గండేపల్లి, జూలై 18(ఆంధ్రజ్యోతి): ఆకాశంలో ఎగిరే విమానం రోడ్డుపై దర్శనమిస్తే... పట్టాలపై వెళ్లాల్సిన రైలు లారిపై కనపడితే... ఇదుగో ఇలా ఉంటుంది. రాజమహేంద్రవరం వైపు నుంచి వైజాగ్ వైపు ట్రాలీపై విమానాన్ని తరలిస్తుండగా కాకినాడ జిల్లా గండేపల్లి మండలం జడ్.రాగంపేట జాతీయ రహదారిపై స్థానిక ప్రజలు ఆసక్తిగా తిలకించారు. ఇక, కాకినాడ జిల్లా గండేపల్లి జాతీయ రహదారిపై రైలింజన్‌ను లారీ ట్రాలీపై తరలి వెళ్తే కనిపించింది. ట్రాలీపై తరలిస్తున్న విమానం, రెలింజన్‌ను చూసి స్థానికులు, వాహనదారులు ఫొటోలు, సెల్ఫీలు తీసుకుని ఆనందించారు.