విశాఖ-విజయవాడ ఫ్లైట్‌లో సాంకేతిక సమస్య
ABN , Publish Date - Jun 03 , 2026 | 04:38 AM
విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో టేకాఫ్ అయిన పది నిమిషాలకే తిరిగి ల్యాండైంది. విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్లాల్సిన ఎయిర్...
విమానంలో ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ
గోపాలపట్నం (విశాఖపట్నం), జూన్ 2 (ఆంధ్రజ్యోతి): విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో టేకాఫ్ అయిన పది నిమిషాలకే తిరిగి ల్యాండైంది. విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం మంగళవారం రాత్రి ఏడు గంటలకు బయలుదేరింది. అయితే టేకాఫ్ జరిగిన 10 నిమిషాలకు విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో తిరిగి విమానాశ్రయానికి చేరుకుంది. రాత్రి 9.30 గంటల వరకు విమానం సిద్ధం కాకపోవడంతో ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్టు సమాచారం. విమానంలో ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కూడా ఉన్నారు.