Share News

‘ఏఐ’తో టీబీ నిర్ధారణ: మంత్రి సత్యకుమార్‌

ABN , Publish Date - Mar 25 , 2026 | 05:18 AM

రాష్ట్రంలో క్షయ (టీబీ) వ్యాధి లక్షణాలు కలిగిన వారిని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించేందుకు ఏఐ సాకేతికతతో కూడిన అత్యాధునిక ‘హ్యాండ్‌ హెల్డ్‌ ఎక్స్‌రే’ మెషిన్లు అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి సత్యకుమార్‌ తెలిపారు.

‘ఏఐ’తో టీబీ నిర్ధారణ: మంత్రి సత్యకుమార్‌

అమరావతి, మార్చి 24(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో క్షయ (టీబీ) వ్యాధి లక్షణాలు కలిగిన వారిని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించేందుకు ఏఐ సాకేతికతతో కూడిన అత్యాధునిక ‘హ్యాండ్‌ హెల్డ్‌ ఎక్స్‌రే’ మెషిన్లు అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి సత్యకుమార్‌ తెలిపారు. మంగళవారం ప్రపంచ క్షయ దినోత్సవం సందర్భంగా వ్యాధిగ్రస్థుల గుర్తింపు, తీసుకుంటున్న చర్యలపై అధికారులతో ఆయన వర్చువల్‌గా సమీక్షించారు. దాదాపు రూ.20 కోట్ల వ్యయంతో 100 మెషిన్లను టెండర్ల ద్వారా త్వరలో కొనుగోలు చేయబోతున్నామని తెలిపారు. వీటిద్వారా ఇంటి ముగింట్లోనే టీబీ నిర్థారణ పరీక్షలు చేపడతారని చెప్పారు. కేంద్రం గుర్తించిన 4,126 హాట్‌స్పాట్‌ గ్రామాల్లో వీటిని వినియోగిస్తామన్నారు. ఈ గ్రామాల్లో 14 ఏళ్లు నిండిన వారందరికీ ఉచితంగా పరీక్షలు చేస్తామని ఆదేశించారు కాగా, రాష్ట్రంలో 150 ఆయుష్‌ ఆరోగ్య కేంద్రాల నూతన భవన నిర్మాణాలు, ఆధునికీకరణ పనులు చురుగ్గా జరుగుతున్నాయని సత్యకుమార్‌ తెలిపారు. రూ.44కోట్లతో చేపట్టే ఈ భవనాల నిర్మాణాలు, ఆధునికీకరణ పనులు వివిధ దశల్లో ఉన్నాయని, 2నెలల్లోగా పూర్తిచేసి ప్రారంభిస్తామని వెల్లడించారు. జిల్లా ఆస్పత్రుల ప్రాంగణాల్లో ఒక్కోకేంద్రం నిర్మాణనికి రూ.50 లక్షలు చొప్పున వెచ్చిస్తారని, ఏలూరు, మచిలీపట్నం, ఒంగోలు, చిత్తూరు, కడప, కర్నూలు, నంద్యాల ఆస్పత్రుల్లో నూతనంగా ఆయుష్‌ ఆరోగ్య కేంద్రాల్ని నిర్మిస్తున్నట్లు మంత్రి వివరించారు.

Updated Date - Mar 25 , 2026 | 05:18 AM