అమరావతికి మణిహారంగా ఎయిమ్స్
ABN , Publish Date - Jan 25 , 2026 | 04:31 AM
ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చెందుతున్న అమరావతికి మంగళగిరి ఎయిమ్స్ ఆస్పత్రి మణిహారంగా నిలవనుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.
అనతి కాలంలోనే రోగులకు మెరుగైన సేవలు
ఆస్పత్రి వార్షికోత్సవంలో మంత్రి సత్యకుమార్
మంగళగిరి సిటీ, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చెందుతున్న అమరావతికి మంగళగిరి ఎయిమ్స్ ఆస్పత్రి మణిహారంగా నిలవనుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. శనివారం మంగళగిరి ఎయిమ్స్ 8వ వ్యవస్థాపక దినోత్సవంలో ఆయన ప్రసంగించారు. మంగళగిరి ఎయిమ్స్ అనతి కాలంలోనే రోగులకు మెరుగైన సేవలు అందిస్తూ విశ్వాసం పొందిందన్నారు. ఎయిమ్స్ అభివృద్ధికి పూర్తి సహకారాన్ని అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. 190 ఎకరాల్లో కేటాయించాల్సిన మరో 10 ఎకరాలను ప్రభుత్వం త్వరగా కేటాయించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దీనివల్ల ట్రామాకేర్ కూడా అందుబాటులోకి వస్తుందన్నారు. పీపీపీ విధానంలో వైద్యకళాశాలలను నడపాలని కూటమి ప్రభుత్వం నిర్ణయిస్తే, విషప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. పీపీపీ విధానంలో నడిచే వైద్య కళాశాలలపై యాజమాన్య హక్కులు ప్రభుత్వం వద్దనే ఉంటాయని మంత్రి స్పష్టం చేశారు. కార్యక్రమంలో పద్మశ్రీ డాక్టర్ నళిని పార్థసారఽథి కంబైన్డ్ కంబాట్ మెడికల్ సర్వీసెస్ ఆఫ్ సీపీఎంఎ్‌ఫఎస్ డాక్టర్ ఆర్‌ఎస్ రాథోడ్, మంగళగిరి ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏఎస్ సింగ్, ఎన్టీఆర్ వర్సిటీ ఉపకులపతి చంద్రశేఖర్, ఎయిమ్స్ అధ్యక్షుడు మేజర్ జనరల్ తపన్‌కుమార్ సింగ్ పాల్గొన్నారు.